Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. హిట్టర్లతో బరిలోకి!!

KKR vs MI: Kolkata Knight Riders have won the toss and have opted to field

అబుదాబి: షేక్ జాయెద్ స్టేడియంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ దినేష్ కార్తీక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. హిట్టర్లు రసెల్, నరైన్, మోర్గాన్ కోల్‌కతా తరఫున బరిలోకి దిగనున్నారు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు చేయలేదు. చెన్నైతో ఆడిన జట్టుతోనే ముంబై బరిలోకి దిగుతోంది.

తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి పాలైన ముంబై.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలని చూస్తోంది. మరోవైపు కోల్‌కతా తొలి మ్యాచ్‌లోనే గెలిచి జట్టులో ఆత్మవిశ్వాసం నింపుకోవాలని చూస్తోంది .బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమవుజ్జీలుగా ఉన్న ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే మైదానం పెద్దది కావడంతో ఎక్కువగా సిక్సులు నమోదయ్యే అవకాశం లేదు. డ్యూ ప్రభావం ఉండనుంది. ముంబై, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ పరిస్థితులే ఉండనున్నాయి. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు.

సగానికిపైగా టీమ్‌లో హిట్టర్లు ఉన్న కోల్‌కతా ప్రమాదకరంగా ఉంది. ఇటీవల ముగిసిన కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తాచాటిన వెస్టిండీస్ హిట్టర్లు ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌తో పాటు విధ్వంసక బ్యాట్స్‌మెన్ ఇయాన్ మోర్గాన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గురూ సూపర్ ఫామ్‌లో ఉండటంతో.. ఏ ఇద్దరు క్లిక్ అయినా ముంబై బౌలర్లకి కష్టాలు తప్పవు. మరోవైపు రోహిత్, డికాక్, పోలార్డ్, పాండ్యాలతో ముంబై కూడా పటిష్టంగానే ఉంది.

గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. కోల్‌కతాపై ముంబైదే ఆధిపత్యం. ఐపీఎల్ లీగ్‌లో ఈ రెండు జట్లు 25 సార్లు తలపడ్డాయి. ముంబై 19 సార్లు విజయం సాధించింది. కోల్‌కతా కేవలం 6 విజయాలు మాత్రమే నమోదు చేసింది. అయితే 2014లో ఇదే వేదిక మీద జరిగిన మ్యాచ్‌లో ముంబైని కోల్‌కతా ఓడించింది. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా ఏకంగా 41 పరుగుల తేడాతో ముంబైపై గెలుపొందడం గమనార్హం. ఇది కేకేఆర్‌ జట్టుకు సానుకూలాంశం.

తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ ‌శర్మ (కెప్టెన్‌), క్వింటన్ డికాక్ ‌(కీపర్‌), సౌరభ్‌ తివారి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, జేమ్స్ పాటిన్సన్‌‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్ బుమ్రా, రాహుల్‌ చాహర్‌.

కోల్‌కతా నైట్ రైడర్స్: దినేశ్‌ కార్తీక్ ‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), సునీల్ నరైన్‌, శుభ్‌మన్ ‌గిల్‌, నితీశ్‌ రాణా, ఇయాన్ మోర్గాన్‌, అండ్రీ రసెల్‌, పాట్ కమిన్స్‌, కుల్దీప్‌ యాదవ్‌, నిఖిల్ నాయక్, శివం మావి, సందీప్ వార్రియర్.

Story first published: Wednesday, September 23, 2020, 19:14 [IST]
Other articles published on Sep 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+