న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా దేశానికి ఏం చేశానో ఈ ప్రపంచానికి తెలుసు.. ట్రోలింగ్‌పై ముంబై ఇండియన్స్ పేసర్ ఫైర్!

 Mumbai Indians pacer Lasith Malinga responds on criticism of backing out from LPL

కొలంబో: లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్) నుంచి తప్పుకున్న ఆ దేశ క్రికెటర్, ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ లసిత్ మలింగాపై తీవ్ర ట్రోలింగ్ జరుగుతుంది. కొన్నేళ్లపాటు ఐపీఎల్‌కు ప్రాతినిథ్యం వహించిన మలింగా.. తమ దేశానికి చెందిన టీ20 లీగ్ ఆడకపోవడంపై శ్రీలంక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడటానికి వచ్చిన సమస్య ఏందని, డబ్బుల కోసం ఆడుతావా? అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఎల్‌పీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా మలింగాను రోస్ట్ చేస్తున్నారు. లీగ్ అరంగేట్ర సీజన్‌ను సక్సెస్ చేసేందుకు సీనియర్ క్రికెటర్‌గా బాధ్యత తీసుకోవాల్సింది పోయి తప్పుకుంటావా? అని మండిపడుతున్నారు.

నేనేం చేశానో తెలుసు..

నేనేం చేశానో తెలుసు..

ఈ ట్రోలింగ్‌పై తాజాగా మలింగా స్పందించాడు. దేశానికి తాను ఏం చేశానో ఈ ప్రపంచం మొత్తానికి తెలుసని బదులిచ్చాడు. ‘ ఎల్‌పీఎల్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన వ్యక్తికి మ్యాచ్ ప్రాక్టీ‌స్ లేకపోవడం ఓ సమస్య అని కొందరు అనుకుంటున్నారు. కానీ ఇంట్లో ఉండే జిమ్‌తోఅంతర్జాతీయ స్థాయి క్రికెట్‌కు సిద్దం కాలేం. నేను ఒక మ్యాచ్‌లో యార్కర్ వేసే ముందు వెయ్యిసార్లు ప్రాక్టీస్ చేస్తాను. అంతేకానీ ఏదో యాక్సిడెంటల్‌గా వేసేది కాదు.

 మళ్లీ వీరే విమర్శిస్తారు..

మళ్లీ వీరే విమర్శిస్తారు..

ఇక ఎల్‌పీఎల్‌లో యార్కర్లు వేయడంలో విఫలమైతే.. అప్పుడు జనాలు ఐపీఎల్‌లో అద్భుతంగా వేసి.. ఎల్‌పీఎల్‌లో కావాలనే వేయడం లేదని విమర్శిస్తారు. ఇలా అనేవారే జాతీయ జట్టు తరఫున రాణిస్తే ప్రశంసిస్తారు. నెత్తినపెట్టుకొని కొనియాడుతారు. కొన్నిసార్లు మనం ఎంత సాధించినా విమర్శలు తప్పవు. నా దేశం కోసం నేనేం చేశాననేది ఈ ప్రపంచానికి తెలుసు. నన్ను ప్రేమించే వ్యక్తులకు కూడా ఇది తెలుసు. అది నాకు సరిపోతుంది.'అని తెలిపాడు.

ఐపీఎల్‌కు దూరం..

ఐపీఎల్‌కు దూరం..

ఇక ఫ్యామిలీ ప్లాబ్లమ్స్ వల్ల మలింగా ఈ సీజన్ ఐపీఎల్ ఆడని విషయం తెలిసిందే. ముందుగా ఆడుతాడని అందరూ భావించినా.. తండ్రి అనారోగ్యం కారణంగా అతను లీగ్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్ రఫ్ఫాడించడంతో ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ గెలిచుకుంది. ఇక 2019 సీజన్ టైటిల్‌ను ముంబై గెలవడంలో మలింగా కీలక పాత్ర పోషించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన టైటిల్ ఫైట్‌లో ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా వేసి థ్రిల్లింగ్ విజయాన్నందించాడు. ఇక నవంబర్ 26 నుంచి ఎల్‌పీఎల్ షూరు కానుంది.

IPL 2020 సక్సెస్‌పై శ్రీలంక ఫ్యాన్ కుళ్లుబోతు ట్వీట్.. సెటైరిక్‌గా బదులిచ్చిన భారత మాజీ క్రికెటర్!

Story first published: Tuesday, November 24, 2020, 16:17 [IST]
Other articles published on Nov 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X