న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020 సక్సెస్‌పై శ్రీలంక ఫ్యాన్ కుళ్లుబోతు ట్వీట్.. సెటైరిక్‌గా బదులిచ్చిన భారత మాజీ క్రికెటర్!

Wasim Jaffer trolls a Sri Lankan fan who’s jealous of IPL 2020’s success

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చరుకుగా ఉంటున్నారు. నిత్యం ఎవర్నో ఒకర్నీ ట్రోల్‌ చేస్తూ సరదా మీమ్‌లతో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఐపీఎల్ 2020 సక్సెస్‌పై కుళ్లుతో ఓ శ్రీలంక అభిమాని చేసిన ట్వీట్‌పై వసీం జాఫర్ తనదైన శైలిలో సెటైరిక్‌గా స్పందించాడు. కరోనా విపత్కర పరిస్థితుల నడుమ జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ 2020 సీజన్ చివరకు యూఏఈ వేదికగా ఊహించని విధంగా సక్సెస్ అయింది.

అయితే ఈ లీగ్ సక్సెస్‌ను జీర్ణించుకోలేకపోయిన ఓ శ్రీలంక అభిమాని భారత క్రికెట్ బోర్డుపై విషం చిమ్మాడు. ఒక్క ఐపీఎల్ కోసం టీ20 ప్రపంచకప్, ఆసియా కప్, ఇతర అంతర్జాతీయ సిరీస్‌లను పక్కనపెట్టారని అసహనం వ్యక్తం చేశాడు.

'వివాదాస్పద ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించడం కోసం టీ20 ప్రపంచకప్, ఆసియా కప్, ఇతర అంతర్జాతీయ సిరీస్‌లు అన్ని నిలిపివేశఆరు. మరోసారి ఈ ఐపీఎల్ 2021 కోసమే వచ్చే ఏడాది ఫస్టాఫ్‌లో అంతర్జాతీయ సిరీస్‌లు అన్నీఆగిపోనున్నాయి. రెండు సందర్భాల్లో టెస్ట్ చాంపియన్‌షిప్ ఆపడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు'అని ట్వీట్ చేశాడు.

Wasim Jaffer trolls a Sri Lankan fan who’s jealous of IPL 2020’s success

దీనిపై వసీమ్ జాఫర్ తనదైన శైలిలో సెటైరికల్‌గా స్పందించాడు. 'ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయబ్బా.. కొంచెం చెప్పరాదు'అనే ఫన్నీ మీమ్‌ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో వసీమ్ జాఫర్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరకపోయినా థ్రిల్లింగ్ మ్యాచ్‌లతో ఆకట్టుకుంది.

నేను ఫామ్‌లోకి వచ్చా.. ఇక కాచుకోండి.. భారత బౌలర్లకు స్టీవ్ స్మిత్ వార్నింగ్!నేను ఫామ్‌లోకి వచ్చా.. ఇక కాచుకోండి.. భారత బౌలర్లకు స్టీవ్ స్మిత్ వార్నింగ్!

Story first published: Tuesday, November 24, 2020, 14:42 [IST]
Other articles published on Nov 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X