న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోని అనుభవమే కోహ్లీ అతడిని ఆడించేలా చేస్తుంది'

MS Dhoni will be Virat Kohlis go-to-man at World Cup, says Suresh Raina

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ఆరంభం కానున్న వరల్డ్‌కప్‌లో ధోని అనుభవానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ పెద్దపీట వేయక తప్పదని మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా వెల్లడించాడు. ఆస్ట్రేలియా భారత పర్యటనలో భాగంగా రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేఫత్యంలో సురేశ్ రైనా మీడియాతో మాట్లాడాడు.

ICC Women's T20 World Cup: గురువారం నుంచి టికెట్ల అమ్మకంICC Women's T20 World Cup: గురువారం నుంచి టికెట్ల అమ్మకం

"ధోనీ.. ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనల్లో నిలకడగా రాణించాడు. వికెట్ల వెనుక మెరుపులు మెరిపిస్తూనే.. బౌలర్లకి విలువైన సూచనలు చేస్తూ వారికి సాయపడ్డాడు. ధోని అనుభవం అపారం. ప్రపంచ క్రికెట్‌లో చాలా ఎత్తుపల్లాలు చూశాడు. ప్రపంచకప్‌లు, ఐపీఎల్‌ ఫైనల్స్‌లో‌ జట్లని అతడు నడిపించిన తీరు.. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో కోహ్లీ అతడిని ఆడించేలా చేస్తుంది" అని రైనా అన్నాడు.

గతేడాది పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన ధోనీ.. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించడంతో పాటు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌' అవార్డుని సైతం అందుకున్నాడు.ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో సైతం ధోని రాణించాడు. దీంతో వరల్డ్‌కప్‌లో ధోని ఆడటంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి.

కాగా, ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్ ఆడనుంది. ఫిబ్రవరి 24న విశాఖపట్నం వేదికగా జరిగే తొలి టీ20తో ఈ సిరిస్ ప్రారంభం కానుంది. వరల్డ్‌కప్‌కి ముందు టీమిండియా ఆడనున్న చివరి వన్డే సిరిస్ ఇదే కావడం విశేషం. దీంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్‌లో వరల్డ్ కప్‌కు ఎంపిక చేయబోయే జట్టుపై సెలక్టర్లు దృష్టి సారంచనున్నారు.

Story first published: Wednesday, February 20, 2019, 15:14 [IST]
Other articles published on Feb 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X