న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'Infamous' 36 నాటౌట్: 'నా చెత్త ఇన్నింగ్స్‌ను గుర్తు చేసిన ధోని'

By Nageshwara Rao
India vs England: MS Dhoni's Struggle Reminded Gavaskar of His 'Infamous' 36
MS Dhonis Struggle Reminded Gavaskar of His Infamous

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో పేలవ ప్రదర్శన చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. వేగంగా ఆడాల్సిన త‌రుణంలో డిఫెన్సివ్‌గా ఆడి 59 బంతుల్లో 37 ప‌రుగులు మాత్ర‌మే చేసిన ధోనిపై మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప‌రోక్షంగా చుర‌క‌లంటించాడు.

59 బంతుల్లో 37 పరుగులు

59 బంతుల్లో 37 పరుగులు

రెండో వన్డేలో ధోని 59 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. 323 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా వెనువెంటనే టాపార్డర్ వికెట్లు చేజార్చుకుంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోని నెమ్మదిగా ఆడాడు. డెత్‌ ఓవర్లలో ఫ్లంకెట్‌ వేస్తున్న బంతులను బాదకుండా ధోని డిఫెండ్‌ మాత్రమే చేశాడు.

86 పరుగుల తేడాతో భారత్ ఓటమి

86 పరుగుల తేడాతో భారత్ ఓటమి

దీనిని చూసి అసహనానికి గురైన కొందరు అభిమానులు మైదానంలోనే విమర్శలు చేశారు. 86 పరుగుల తేడాతో భారత్‌ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. చివర్లో ధోని దూకుడుగా ఆడి ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. త‌న కెరీర్‌లో మాయ‌ని మ‌చ్చగా మిగిలిపోయిన ఇన్నింగ్స్‌ను తాజాగా ధోని గుర్తు చేశాడ‌ని గవాస్కర్ పేర్కొన్నాడు.

174 బంతుల‌ను ఎదుర్కొన్న గవాస్కర్ 36 పరుగులు

174 బంతుల‌ను ఎదుర్కొన్న గవాస్కర్ 36 పరుగులు

ఇంగ్లండ్‌లో ఇదే లార్డ్స్ వేదిక‌గా 1975 వరల్డ్‌కప్‌లో భాగంగా జ‌రిగిన మ్యాచ్‌లో 174 బంతుల‌ను ఎదుర్కొన్న గ‌వాస్క‌ర్ కేవ‌లం 36 ప‌రుగులు మాత్ర‌మే చేసి తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. ఈ ఇన్నింగ్స్ గవాస్కర్ క్రికెట్ చరిత్రలోనే ఓ మాయని మచ్చ ఇన్నింగ్స్ లాగా మిగిలిపోయింది. ఇటీవల ధోని ఇన్నింగ్స్‌ను అప్పటి తన ఇన్నింగ్స్‌తో పోల్చుతూ గ‌వాస్క‌ర్ మాట్లాడాడు.

నా ప్ర‌సిద్ధ చెత్త ఇన్నింగ్స్‌ను గుర్తుకు తెచ్చిన ధోని

నా ప్ర‌సిద్ధ చెత్త ఇన్నింగ్స్‌ను గుర్తుకు తెచ్చిన ధోని

"తాజాగా లార్డ్స్ మైదానంలో ధోని ఆడిన ఇన్నింగ్స్‌.. నా ప్ర‌సిద్ధ చెత్త ఇన్నింగ్స్‌ను గుర్తుకు తెచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో ధోని ఆట‌తీరును పూర్తిగా విమ‌ర్శించ‌కూడ‌దు. ఎందుకంటే అప్ప‌టికే టీమిండియా ఓట‌మి ఖ‌రారైపోయింది. ఆ స‌మ‌యంలో మంచి షాట్లు ఆడే ఆత్మ‌విశ్వాసం ఆట‌గాళ్ల‌కు ఉండ‌దు" అని గ‌వాస్క‌ర్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, July 17, 2018, 14:18 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X