న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

#DhoniBirthdayCDP: ఎంఎస్ ధోనీ బర్త్ డే స్పెషల్.. కామన్ డీపీ ఇదే!!

MS Dhonis Birthday Special Common DP Unveiled Ahead of His Birthday

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ.. జులై 7న 39వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ధోనీ పుట్టిన రోజుకి ఇంకా వారం సమయం ఉంది. అయితే ఇప్పటినుండే మహీ అభిమానులు, అనుచరుల సందడి మొదలైంది. అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ధోనీకి శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. దీంతో సోషల్ మీడియాలో మహీ పేరు ఇప్పటినుండే మార్మోగిపోతోంది.

#DhoniBirthdayCDP హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్:

#DhoniBirthdayCDP హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్:

ఎంఎస్ ధోనీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి 'కామన్ డీపీ' ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ట్విట్టర్‌లో ఇప్పటికే #DhoniBirthdayCDP హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌గా మారిపోయింది. డీపీలో మహీ బ్యాట్ పట్టుకుని 'స్టయిలిష్'గా నిలబడగా.. వెనకాల ధోనీ అని రాసుకుంది. ధోనీ పేరు మొత్తం అపార్ట్మెంట్, టవర్ మాదిరిలో ఉండడం విశేషం. ప్రస్తుతం నెట్టింట్లో ఈ 'కామన్ డీపీ' వైరల్ అవుతోంది. మహీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. జులై 7న అందరూ తమ సోషల్ మీడియా ఖాతాలకు ఈ డీపీని వాడనున్నారు.

ధోనీ సాంగ్‌ నం7

మరోవైపు పీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి పాటను అంకితమిచ్చేందుకు ఆ జట్టు ఆటగాడు, వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో సిద్ధమయ్యాడు. ధోనీ ఘనతలు, గొప్పతనాన్ని కీర్తిస్తూ 'ఎంఎస్ ధోనీ సాంగ్‌ నం7​' పేరిట బ్రావో ఈ పాటను రూపొందిస్తున్నాడు. ధోనీ పుట్టినరోజును పురస్కరించుకొని జులై 7న పాటను విడుదల చేసేందుకు సిద్ధమైనట్టు బ్రావో ఇప్పటికే ప్రకటించాడు. బ్రావో గతంలో మాట్లాడుతూ ధోనీ కోసం ఏదైనా కొత్తగా చేయాలని ఉందన్నాడు. మహీ ఎంతో మంది ఆటగాళ్లకు అవకాశాలిచ్చాడని, అందుకే అతడిపై ఓ పాట రాస్తున్నానన్నాడు. ఇలా ఏ క్రీడాకారుడిపైనా ఎవరూ పాటతో తమ అభిమానాన్ని చాటలేదని, తానే కొత్త ఆలోచనలతో వచ్చానని తెలిపాడు.

ప్రపంచకప్ తర్వాత దూరం

ప్రపంచకప్ తర్వాత దూరం

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.

2004లో అంతర్జాతీయ అరంగేట్రం:

2004లో అంతర్జాతీయ అరంగేట్రం:

ఎంఎస్ ధోనీ బంగ్లాదేశ్‌తో 2004లో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మహ్మద్ కైఫ్ కారణంగానే ఆ మ్యాచ్‌లో రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. దీంతో ధోనీ కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావించారు. కానీ విశాఖ తీరాన విధ్వంసంతో (123 బంతుల్లో 15 ఫోర్లు 4 సిక్స్‌లతో 148 రన్స్) ధోనీ మైదానంలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ సారథిగా నిలిచాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్‌గా భారత్‌ని విజేతగా నిలిపిన ధోనీ.. క్రికెట్ చరిత్రలో ఓ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు.

21వ శతాబ్దపు 'మోస్ట్ వాల్యూయెబుల్ క్రికెటర్'గా రవీంద్ర జడేజా!!

Story first published: Wednesday, July 1, 2020, 14:26 [IST]
Other articles published on Jul 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X