ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై? చెపాక్ వేదికగా వీడ్కోలు!(వీడియో)
ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఐదుసార్లు చెన్నైకి ట్రోఫీలు అందించిన ధోనీ.. 2026 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే తప్పుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. గాయంతో మొదటి సగం సీజన్‌కు దూరమైన ఎంఎస్ ధోనీ.. కోలుకున్న తర్వాత కూడా రెండో సగంలో బరిలోకి దిగలేదు. శనివారం ముంబై ఇండియన్స్ జట్టుతో మ్యాచ్ ముగిసిన అనంతరం.. ధోనీకి సీఎస్కే జట్టు సభ్యులు ఇచ్చిన 'గాడ్ ఆఫ్ ఆనర్' చూశాక, ఆయన ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేశారని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
చెపాక్ వేదికగా అరుదైన గౌరవం
ముంబై జట్టుపై విజయం తర్వాత సొంత గడ్డ అయిన చెన్నై చెపాక్ స్టేడియంలో ధోనీ కోసం ఓ ప్రత్యేక వేడుక జరిగింది. మైదానంలో ధోనీ సారథ్యంలో సీఎస్కే సాధించిన ఐదు ఐపీఎల్ ట్రోఫీలు, ఛాంపియన్స్ లీగ్ కప్పులతో పాటు ఆయన గెలుచుకున్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను ఓ వరుసలో ప్రదర్శించారు. ఆటగాళ్లందరూ చప్పట్లతో ధోనీని ఆహ్వానించగా.. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఆయన ఫోటోలకు ఫోజులిచ్చారు. అనంతరం స్టేజి పైనుంచి దిగి ధోనీ తల దించుకుని భారంగా నడుచుకుంటూ వెళ్తున్న వీడియో నెటిజన్ల కళ్లు చెమర్చేలా చేస్తోంది.

ఫ్యాన్స్ ఆవేదన.. ఒక్క మ్యాచ్ ఆడాల్సిందే!
తమ అభిమాన ఆటగాడు ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వీడ్కోలు పలకడాన్ని సీఎస్కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రిటైర్మెంట్ ప్రకటించే ముందు కనీసం ఒక్కసారైనా ఆయన మైదానంలో బ్యాట్ పట్టి మెరవాలని వారు కోరుకుంటున్నారు. 2023లో ఐదోసారి టైటిల్ గెలిచిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన ధోనీ.. ఓ ఆటగాడిగా కూడా రిటైర్ అవుతారని ఎవరూ ఊహించలేదు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో, ధోనీ అధికారిక ప్రకటన కోసం క్రికెట్ లోకం ఎదురుచూస్తోంది.
ఐపీఎల్‌లో ధోనీ ప్రస్థానం
ధోనీ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 278 మ్యాచ్‌లు ఆడి 5,439 పరుగులు సాధించాడు. ఇందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. ఇక ప్రస్తుత సీజన్ విషయానికి వస్తే.. సీఎస్కే ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి పట్టికలో 7వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన 5 మ్యాచ్‌ల్లో సీఎస్కే ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కీలక సమయంలో ధోనీ రిటైర్మెంట్ వార్తలు రావడం జట్టులోనూ, అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications