ఈ లింక్ ఏంది సామీ?: స్మృతి మంధానపై డీకే సంచలన కామెంట్స్
ఆర్సీబీ అధికారిక పాడ్‌కాస్ట్‌లో టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ పాల్గొని స్మృతి మంధానపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఐపీఎల్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న దినేష్ కార్తీక్.. స్మృతి మంధాన నాయకత్వ పటిమను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయానని తెలిపాడు. మైదానంలో స్మృతి ప్రదర్శించే ప్రశాంతత, తీసుకునే నిర్ణయాల్లో ఉండే స్పష్టత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని డీకే పేర్కొన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆమె ఏమాత్రం కంగారు పడకుండా, అద్భుతంగా మ్యాచ్‌ను అంచనా వేస్తుందని కార్తీక్ కొనియాడాడు.
స్మృతి మంధానలో ఎంఎస్ ధోనీ ఛాయలు
ఈ సందర్భంగా స్మృతి మంధాన కెప్టెన్సీ శైలిని వివరిస్తూ.. ఆమెను దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పోల్చారు. "స్మృతి మంధాన తన జట్టులోని ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తుంది. వారు తమ సహజ సిద్ధమైన ఆటను ఆడేలా ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో ఆటగాళ్లకు ఏదైనా సందేహం వస్తే, ఓ పెద్ద దిక్కులా ఉండి మార్గనిర్దేశం చేస్తుంది. గతంలో ఇలాంటి హుందాతనం, నాయకత్వ లక్షణాలు నేను కేవలం ఎంఎస్ ధోనీలోనే చూశాను" అని దినేష్ కార్తీక్ వివరించాడు. ఆర్సీబీ ఐకాన్ విరాట్ కోహ్లీ కంటే, ధోనీ స్టైల్‌లోనే ఆమె జట్టును నడిపిస్తుందని డీకే అభిప్రాయపడ్డాడు.

డబ్ల్యూపీఎల్ 2026 విజేతగా ఆర్సీబీ.. మంధాన ఖాతాలో రెండో టైటిల్
ఫిబ్రవరి 2026లో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ఆర్సీబీ రెండోసారి టైటిల్‌ను ముద్దాడింది. ఈ నిర్ణయాత్మక పోరులో 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో స్మృతి మంధాన విధ్వంసం సృష్టించింది. కేవలం 41 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. 2023లో డబ్ల్యూపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న స్మృతి మంధాన, కేవలం నాలుగు సీజన్లలోనే రెండు ట్రోఫీలను అందించి, లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన మహిళా కెప్టెన్‌గా తన ముద్ర వేసింది.
టీ20 వరల్డ్ కప్ 2026 వేటలో స్మృతి మంధాన
మరోవైపు ఇంగ్లండ్ వేదికగా త్వరలో ప్రారంభం కానున్న 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన భారత జట్టులో స్మృతి మంధాన కీలక సభ్యురాలిగా ఎంపికైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత్ తన తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ జట్టులో యువ టాలెంట్ నందిని శర్మకు తొలిసారి అవకాశం దక్కింది. షెఫాలీ వర్మతో కలిసి స్మృతి మంధాన ఓపెనింగ్‌లో మెరుపులు మెరిపించాల్సి ఉండగా.. జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ మిడిల్ ఆర్డర్‌లో బలం చేకూర్చనున్నారు. బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ, రేణుకా సింగ్ టీమిండియా ప్రధాన అస్త్రాలుగా ఉండబోతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications