Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే మా మ్యాచ్ విన్నర్‌ను పక్కన పెట్టాం: రుతురాజ్ గైక్వాడ్

చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ, అభిమానుల కోసం తమ సర్వస్వం ఇస్తామని ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్.. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉండి విజయలాంఛనాన్ని పూర్తి చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే అకీల్ హుస్సేన్‌ను ఆడించలేదని తెలిపాడు. 'చాలా సంతోషంగా ఉంది. మేం మొదట బాగానే ప్రారంభించాం. కానీ మధ్యలో ముంబై ఇండియన్స్ పుంజుకుంది. అయితే మేం మళ్ళీ మ్యాచ్‌ను మా నియంత్రణలోకి తెచ్చుకున్నాం. మొదటి కొన్ని ఓవర్లను తట్టుకుని నిలబడటం.. ఆపై టాప్ త్రీ బ్యాటర్లలో ఒకరు చివరి వరకు ఉండటం కీలకమని మేం భావించాం.

IPL 2026 Ruturaj Gaikwad Explains Bold Selection Calls and Dropping Akeal Hosein Following MI Victory
Photo Credit: screen grab for JioHotstar

అందుకే అకీల్ హుస్సేన్‌ను ఆడించలేదు..

కంబోజ్ విషయానికొస్తే.. అతను చాలా నిలకడగా రాణిస్తున్నాడు. తన ప్రక్రియను అనుసరిస్తున్నాడు. అతని ఆలోచనా తీరు ఒక బ్యాటర్ లాగా ఉంటుంది. నూర్ కూడా కొన్ని మార్పులు చేసుకుని బాగా రాణిస్తున్నాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే అఖీల్ హుస్సేన్‌ను ఆడించలేదు. 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని, అదనపు బౌలర్ ఉండాలని ఆలోచించాం. ప్రశాంత్ వీర్, ఘోష్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగలరు.

మ్యాచ్ ముగిసే వరకు క్రీజులో ఉండటం సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ చెబుతున్నట్లుగా.. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. అయితే ఇది టీ20 క్రికెట్. సరైన సమయం కోసం వేచి చూశాను. కార్తీక్ శర్మకు ఈ ఇన్నింగ్స్ మంచి బూస్ట్‌లాంటిది. అతను సిక్సర్లు కొట్టగలడు. కానీ అతను బంతులను ఎంచుకొని ఆడిన తీరు బాగుంది. అతను ఫామ్ కొనసాగిస్తే జట్టుకు ప్రయోజనం. మేం ఆటను చాలా సింపుల్‌గా ఉంచుతున్నాం. తప్పులు జరుగుతుంటాయి కానీ బలంగా తిరిగి రావాలి. ఈ జెర్సీ, అభిమానుల కోసం మా సర్వస్వం ఇస్తాం.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.

సత్తా చాటిన రుతురాజ్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం సీఎస్‌కే 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67 నాటౌట్), కార్తీక్ శర్మ(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

Story first published: Sunday, May 3, 2026, 0:35 [IST]
Other articles published on May 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+