న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MS Dhoni Retires: యాదృశ్చికం.. ఆరంభం.. ముగింపు.. రనౌట్‌తోనే!

MS Dhoni Run-out in first international match and run-out in the last Match

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం నుంచి వీడ్కోలు పలికే వరకు ఓ సినిమాకు సరిపడే డ్రామాను తలపించింది. గోల్డెన్ డకౌట్‌తో కెరీర్ మొదలుపెట్టిన ధోనీ.. మరెవరూ ఊహించని విధంగా ఆటకు అల్విదా ఇచ్చాడు. '19:29 గంటల సమయం నుంచి నన్ను రిటైర్‌ అయినట్లుగా పరిగణించగలరు'. అని సింపుల్‌గా ఓ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.

ధోనీపై ఇప్పటికే ఒక బయోపిక్‌ వచ్చేసింది. అయినా సరే అంతకు మించి మరో సినిమాకు సరిపడే డ్రామా అతని కెరీర్‌లో మిగిలే ఉంది. ఎక్కడో వెనుకబడిన రాంచీ నుంచి వచ్చిన నేపథ్యం... రైల్వేలో టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేయడం... ఆ తర్వాత అనూహ్యంగా అంది వచ్చిన అవకాశం... జులపాల జుట్టుతో టార్జాన్‌ లుక్‌...బెదురు లేని బ్యాటింగ్, భీకర హిట్టింగ్‌...కొద్ది రోజులకే కెప్టెన్‌గా మారి టీ20 ప్రపంచ కప్‌ గెలిపించడం... ఇలా ధోని కథలో ఆసక్తికర మలుపులెన్నో. గణాంకాలను అందని ఘనతలెన్నో... బ్యాట్స్‌మన్‌గా అద్భుత టెక్నిక్‌ లేకపోయినా...వికెట్‌ కీపింగ్‌ సాంప్రదాయ శైలికి భిన్నంగా ఉన్నా తను మారలేదు, మారే ప్రయత్నం చేయలేదు. అదే ధోనిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది.

గోల్డెన్ డకౌట్‌తో..

గోల్డెన్ డకౌట్‌తో..

అయితే తన 16 ఏళ్ల కెరీర్‌లో యాదృశ్చికమైన విషయం ఏంటంటే.. ఆరంభం.. ముగింపు రనౌట్‌తోనే కావడం. అవును డిసెంబర్ 23, 2004 బంగ్లాదేశ్‌పై వన్డే అరంగేట్రం చేసిన ధోనీ.. ఆ మ్యాచ్‌లో రనౌట్‌తో కెరీర్ మొదలుపెట్టాడు. అది కూడా గోల్డెన్ డకౌట్‌తో వెనుదిరిగాడు. అనామక క్రికెటర్‌గా మైదానంలోకి వచ్చిన మహీ.. ఎదుర్కొన్న తొలి బంతినే స్క్వేర్‌లెగ్‌ దిశగా ఆడి సింగిల్‌ తీయాలనే ప్రయత్నం చేశాడు. కానీ నాన్‌స్ట్రైకర్‌ మహ్మద్ కైఫ్ సమన్వయం లోపంతో రనౌటై నిరాశగా పెవిలియన్ చేరాడు.

130 కోట్ల మంది..

130 కోట్ల మంది..

అచ్చం అలాగే గతేడాది న్యూజిలాండ్‌తో ఆడిన ఆఖరి మ్యాచ్‌లో రనౌట్‌తోనే కెరీర్ ముగించాడు. అయితే కెరీర్ తొలి నాళ్లలో ఓ ఐకాన్‌గా ఎదుగుతాడని ఎవరూ ఊహించనప్పుడు ఆ రనౌట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ మొన్నటి రనౌట్ మాత్రం ప్రతి క్రికెట్ అభిమాని మదిలో అలాగే నిలిచిపోయింది. ఎందుకంటే ఆశల్లేని స్టితి నుంచి భారత్‌ను ప్రపంచకప్ ఫైనల్ చేర్చే క్రమంలో చోటు చేసుకున్న ఆ రనౌట్.. 130 కోట్ల మంది ఆశలను ఆడియాసలు చేసింది. మైదానంలో ధోనీ తొలిసారి కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అది ఎప్పుడూ ఎవరూ చూడని సంఘటన. ధోనీలా రనౌట్‌తోనే మొదలుపెట్టి.. ముగించిన ఆటగాళ్లు బహషా ఎవరూ లేరనుకుంటా.!

16 ఏళ్ల కెరీర్..

16 ఏళ్ల కెరీర్..

వికెట్ కీపర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ధోనీకి.. టీమిండియాతో 16 ఏళ్ల అనుబంధం ఉంది. ఈ క్రమంలో భారత్ తరఫున 350 వన్డేలు ఆడాడు. 50.57 యావరేజ్‌తో 12,303 రన్స్ సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.. బెస్ట్ స్కోర్ 183 నాటౌట్. ఒక్క వికెట్ కూడా తీశాడు. ఏడాది ఆలస్యంగా డిసెంబర్ 2, 2005న శ్రీలంకపై తొలి టెస్ట్ ఆడిన మహీ.. 2014 డిసెంబర్ 26న ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్ ఆడాడు. మొత్తం 90 టెస్ట్‌ల్లో 38.09 యావరేజ్‌తో 4876 రన్స్ సాధించాడు. 6 సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు చేశాడు. ఓ డబుల్ సెంచరీ(224) కూడా ఉంది. 98 టీ20ల్లో 37.60 యావరేజ్‌తో 1617 రన్స్ సాధించాడు. తన కెరీర్‌లో ఎక్కువ భాగం ఐదు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ధోనీ.. 50 యావరేజ్‌తో 10773 రన్స్ సాధించాడు. ఇక 98 టీ20ల్లో 2 హాఫ్ సెంచరీలతో 1617 రన్స్ చేశాడు.

కుర్రాళ్ల కోసమేనా..?

కుర్రాళ్ల కోసమేనా..?

నిజానికి షెడ్యూల్‌ ప్రకారం మార్చిలో జరగాల్సిన ఐపీఎల్‌ కోసం ధోనీ సిద్ధంగా ఉన్నాడు. అందరికంటే ముందే చెన్నైలో ప్రాక్టీస్‌ కూడా ఆరంభించాడు. ఆ సమయంలో అతను అత్యంత ఫిట్‌గానూ కనిపించాడు. ఈ లీగ్‌లో తానేంటో నిరూపించుకుని టీ20 ప్రపంచక్‌పలో ఆడాలనే భావనలో ఉన్నాడు. కానీ కరోనా ప్రభావంలో లీగ్‌ సెప్టెంబరుకు, పొట్టి ప్రపంచకప్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో ధోనీ పునరాలోచనలో పడ్డట్టున్నాడు. ఆ సమయానికి అతను 40 ఏళ్లకు చేరుకోవడంతో పాటు అంత సమయం వేచి చూడడం అనవసరమని, కుర్రాళ్లు కుదురుకునేందుకు అవకాశం కూడా ఇచ్చినట్టవుతుందని ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సన్నిహితులు తెలిపారు.

బాలేదు ధోనీ.. ఇది ఏ మాత్రం బాలేదు!

Story first published: Sunday, August 16, 2020, 8:04 [IST]
Other articles published on Aug 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X