న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సస్పెన్స్ అంటూ అభిమానులకు ‘బిస్కెట్’.. అప్పుడు గెలిచాం ఇప్పుడూ గెలుస్తామని కవరింగ్.. ధోనీపై నెటిజన్ల ఫైర్

MS Dhoni Literally Fooled Fans, He Revealed the suspense is A Biscuit Promotion, Netizens Fires

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రెండేళ్ల క్రితం అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా నాలుగు సార్లు టైటిల్ అందించిన ధోనీ గతేడాదే సీఎస్‌కేకు గుడ్ బై చెబుతాడని ప్రచారం జరిగింది. కానీ సొంత మైదానం చెన్నై స్టేడియంలో చెన్నై అభిమానుల ముందు ఆడిన తర్వాతే ఆటకు గుడ్ బై చెబుతానని ప్రకటించాడు.

అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ధోనీ ఓ కీలక ప్రకటన చేశాడు. మాములుగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే మహీ శనివారం.. ఫేస్‌బుక్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో సెప్టెంబర్ 25(ఆదివారం) మధ్యాహ్నం 2గంటలకు ఫేస్‌బుక్‌లో లైవ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఓ కీలక ప్రకటన చేస్తానని చెప్పాడు. దాంతో ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం మరోసారి ఊపందుకుంది.

పూర్తి కమర్షియల్ ప్రమోషన్

అయితే ధోనీ క్రికెట్‌కు సంబంధం లేని విషయాన్ని ధోనీ ప్రకటించాడు. ధోనీ ఏం చెబుతాడోనని సోషల్ మీడియాలో 2గంటలకు కళ్లప్పగించి చూసిన నెటిజన్లకు షాకిచ్చాడు. చాలా మంది అభిమానులు హమ్మయ్యా రిటైర్మెంట్ విషయం కాదని కాస్త కూల్ అయినా.. మరికొందరు మాత్రం అడ్వర్టైజ్ మెంట్ కోసం ఫ్యాన్ ఫాలోయింగ్‌ను వాడుకున్న ధోనీ కమర్షియాలిటీని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇంతకీ ధోనీ ప్రకటించిన విషయం ఏంటంటే.. ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ అయిన ఓరియోను మరోసారి 2022లో లాంచ్ చేశాడు. ఇది పూర్తిగా కమర్షియల్ ప్రమోషన్ మాత్రమే.

రిపోర్టర్‌ను దగ్గర కూర్చోబెట్టుకుని మరీ..

ఇకపోతే ఒక రిపోర్టర్‌ను ధోనీ బిస్కెట్ బ్రాండ్ లాంచింగ్ సందర్భంగా వేదికపైకి ఆహ్వానించాడు. 2011లో ఓరియో బిస్కెట్ బ్రాండ్‌ను ప్రారంభించినప్పుడు భారత్ ప్రపంచకప్ గెలిచిందని చెప్పాడు. ఈ సంవత్సరం మనకు మరో ప్రపంచ‌కప్ (టీ20 ప్రపంచకప్) ఉంది. ఈ ఏడాది కూడా ఓరియో బిస్కెట్ బ్రాండ్‌ను మళ్లీ ప్రారంభించినందున భారత్ మరోసారి టైటిల్ ముద్దాడగలదు' అంటూ ఓ కవరింగ్ ఇచ్చాడు.

ఎమోషన్స్‌తో ఆడుకోవడం అలవాటైంది

బిస్కెట్ బ్రాండ్ ప్రమోట్ చేసి ఫ్యాన్స్ సస్పెన్స్‌కు తెరదించిన ధోనీ పట్ల నెటిజన్లు రకరకాల పోస్టులు చేస్తున్నారు. ఎమోషన్స్‌తో ఆడుకోవడం క్రికెటర్లకు అలవాటయిపోయిందంటూ మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న సౌరవ్ గంగూలీ ఇలాగే ఓ ఎడ్యుకేషన్ యాప్ విషయంలో నానా హంగామా చేశాడు. అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్ గురించి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారని ఇలా ఇలాంటి కమర్షియల్ ప్రాజెక్టుల కోసం అభిమానాన్ని బలిపెట్టొద్దంటూ మండిపడుతున్నారు. ఇంకొందరు ఓరియో బిస్కెట్ లాంచ్ చేస్తే ఇండియా గెలిచిందనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సీరియస్ అవుతున్నారు. టు క్రియేట్ హిస్టరీ.. టు రిక్రియేట్ హిస్టరీ అంటూ క్యాప్షన్ పేరిట ఇలాంటి కమర్షియల్ యాడ్స్ చేయడం అభిమానులను స్కామ్ చేయడమేనంటూ ఇంకొందరు అంటున్నారు. ఇకపోతే ఏదేమైనా ఎంఎస్డీ లైవ్ అనేసరికి ఏకంగా లక్ష యాభైవేల మంది రియల్ టైం ఫ్యాన్స్ ఈ ప్రెస్ మీట్ చూశారు.

Story first published: Sunday, September 25, 2022, 15:55 [IST]
Other articles published on Sep 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X