న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇప్పటికీ తానే వేగవంతమైన కీపర్ అని ధోనీ ఫీలింగ్.. రిటైర్మెంట్ విషయం ఎత్తితే..

MS Dhoni close friend Says still feels he is quickest keeper, gets angry when we ask about retirement

రాంచీ: ఇప్పటికీ తానే వేగవంతమైన కీపర్ అని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ఫీలవుతున్నాడని అతని స్నేహితుడొకరు తెలిపారు. రిటైర్మెంట్ విషయం ప్రస్తావిస్తే అతను కోపాద్రిక్తుడవుతున్నాడని, రీ ఎంట్రీ కోసం ఎన్నడూ లేనివిధంగా కష్టపడుతున్నాడని చెప్పుకొచ్చారు. ఇక ఈ జార్ఖండ్ డైనమైట్ ఆటకు దూరమై సుమారు 8 నెలలు. వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి అనంతరం మైదానంలోకి అడుగుపెట్టని మహీ తన భవిష్యత్తు ప్రణాళిక ఏంటో ఇప్పటికీ స్పష్టం చేయడంలేదు. అటు బీసీసీఐ కూడా ధోనీ వ్యవహారం చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తుంది.

ధోనీ రీ ఎంట్రీ కష్టమే..

ధోనీ రీ ఎంట్రీ కష్టమే..

ఈ 8 నెలల కాలంలో ఎలాంటి క్రికెట్ కార్యకలపాల్లో పాల్గొనకపోవడంతో ధోనీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. దీంతో ధోనీ కెరీర్ ముగిసిందని, అతను మళ్లీ భారత జట్టు తరఫున ఆడటం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, మరికొందరూ మాత్రం ధోనీ భవితవ్యం ఐపీఎల్ 2020 సీజన్‌తో తేలనుందన్నారు. ఈ టోర్నీలో ధోనీ రాణిస్తే అతను మళ్లీ భారత జట్టుకు ఎంపికవుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ విఫలమైతే ధోనీనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటారని కూడా పేర్కొన్నారు.

కేఎల్ రాహుల్‌తో సైడ్ ట్రాక్..

కేఎల్ రాహుల్‌తో సైడ్ ట్రాక్..

ఈ మధ్యలో టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ప్రత్యామ్నాయ కీపర్లను ప్రయోగించింది. మొదట్లో రిషభ్ పంత్‌కు ఎక్కువ అవకాశాలివ్వగా.. అతను విఫలమవ్వడంతో కేఎల్ రాహుల్‌ను ప్రయోగించింది. అతను అటు వికెట్ల వెనుకాల.. ఇటు బ్యాటింగ్ అద్భుతంగా రాణించడంతో ధోనీ రీఎంట్రీ వ్యవహారం సైడ్ ట్రాక్ అయింది. ఇక మళ్లీ ఐపీఎల్ ముంగిట ధోనీ ప్రాక్టీస్ మొదలుపెట్టడంతో మరోసారి అతని పునరాగమనం చర్చనీయాంశమైంది. చెన్నై వేదికగా చెన్నైసూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌‌కు ధోనీ హాజరయ్యాడు. ఇక మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్.. కరోనా దెబ్బతో ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరి స్థితులతో ఈ క్యాష్ రిచ్ లీగ్ జరగడం కష్టంగా మారింది. ఈ సీజన్ నిర్వహణపై బీసీసీఐ కూడా ఎటు తేల్చుకోలేకపోతుంది.

ధోనీ భవితవ్యం ప్రశ్నార్థకం..

ధోనీ భవితవ్యం ప్రశ్నార్థకం..

ఈ నేపథ్యంలో ధోనీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ధోనీ కెరీర్ ముగిసినట్లేనని, అతని రీ ఎంట్రీ కష్టమేనని అందరూ భావిస్తున్నారు. అయితే ధోనీపై జరుగుతున్న ప్రచారాన్ని అతని సతీమణి సాక్షి సింగ్ ఖండించే ప్రయత్నం చేస్తున్నా.. మహీ మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు. ధోనీ భవిష్యత్తుపై హాట్ హాట్‌గా డిబేట్ జరుగుతున్న ఈ సమయంలో అతని క్లోజ్ ఫ్రెండ్ ఒకరు ధోనీ ఉద్దేశాన్ని తెలియజేశారు.

మహీ రీ ఎంట్రీ పక్కా..

మహీ రీ ఎంట్రీ పక్కా..

ధోనీ ఇప్పటికీ తానే వేగవంతమైన కీపర్ అని ఫీలవుతున్నాడని తెలిపాడు. అలాగే పునరాగమనం కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ‘రిటైర్మెంట్ విషయం ప్రస్తావిస్తే మహీ కోపాద్రిక్తుడవుతున్నాడు. ఇప్పటికీ అతను పూర్తి ఫిట్‌నెస్ ప్లేయర్‌నని, వేగవంతమైన కీపర్‌నని ఫీలవుతున్నాడు. 'ధోనీ స్నేహితుడు ఏబీపీ న్యూస్‌కు తెలియజేశాడు.

‘గత కొన్ని నెలలుగా రీ ఎంట్రీ కోసం ధోనీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతను ఇంతగా కష్టపడటం నేనెప్పుడు చూడలేదు. యువకుడు కాదనే విషయం అతనికి తెలుసు. అందుకే పూర్తి ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతని వెనుకా ఎవరూ లేనప్పుడే ఎంతో సాధించాడు. ఇప్పుడు కోట్ల అభిమానుల మద్దుతుతో అవకాశాలను అందిపుచ్చుకొని రీ ఎంట్రీ ఇవ్వగలడు. ఫామ్, ఫిట్‌నెస్‌ విషయంలో ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేయగలడు'అని అతను చెప్పుకొచ్చాడు. ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni: The Untold Story' సినిమాలో ధోనీ తన స్నేహితులకి ఇచ్చే విలువేంటో సవివరంగా చూపించారు.

Story first published: Friday, April 3, 2020, 13:25 [IST]
Other articles published on Apr 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X