న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా ప్రదర్శన నాన్నకే అంకితం.. ఆయన లేని లోటు తీర్చలేనిది: మహ్మద్ సిరాజ్

 Mohammed Siraj says Virat bhai told me I have the ability to perform on the big stage
Mohammed Siraj Fulfilled His Late Father's Dream Says His Brother Ismail | Oneindia Telugu

హైదరాబాద్: ఆస్ట్రేలియా ప్రదర్శన తన తండ్రికి అంకితమని టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. తాను వికెట్ తీసిన ప్రతిసారి తన తండ్రి గుర్తొచ్చాడని తెలిపాడు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడని సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీసీసీఐ అవకాశం కల్పించినా.. తండ్రి కల నెరవేర్చేందుకు సిరాజ్ అక్కడే ఉండిపోయాడు. మెల్‌బోర్న్ టెస్ట్‌తో అరంగేట్రం చేసి.. అద్బుత ప్రదర్శనతో తన తండ్రి ఘన నివాళులర్పించాడు.

ఇక ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకొని గురువారం హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. విమానాశ్రయం నుంచి నేరుగా తన తండ్రి మహ్మద్‌ గౌస్‌ సమాధి వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశాడు. అనంతరం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా సిరీస్ సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు.

కోహ్లీ ప్రోత్సహం మరవలేనిది..

కోహ్లీ ప్రోత్సహం మరవలేనిది..

'కష్ట సమయంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నన్ను రీటైన్‌ చేసుకుంది. కోహ్లీ భాయ్‌ నన్నెంతో ప్రోత్సహించాడు. ఒత్తిడి వీడి ఆటపై దృష్టి సారించాలని చెప్పాడు. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఐపీఎల్‌ ద్వారా మంచి అనుభవం లభించింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పోలిస్తే టెస్ట్ క్రికెట్‌ ఆడటం చాలా భిన్నమైంది. ఆసీస్‌ పర్యటనతో సంతోషంగా ఉన్నా. నాన్న కలను నెరవేర్చాలని పట్టుదలగా ఆడాను. టీమిండియాకు ఆడుతున్నా అనే విషయం మాత్రమే గుర్తుపెట్టుకున్నా.

 అదే నా ఫేవరేట్ వికెట్..

అదే నా ఫేవరేట్ వికెట్..

ఒత్తిడికి లోనుకాకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. బుమ్రా నాకు పూర్తి మద్దతుగా నిలిచాడు. నాలుగో టెస్టులో తొలుత కాస్త ఆందోళనకు గురయ్యాను. కానీ అతను అండగా నిలిచాడు. నా ప్రదర్శనను ప్రశంసిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇక అజ్జూ భాయ్‌(అజింక్య రహానే) యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచాడు. నటరాజన్‌, సైనీ, వాషింగ్టన్‌ సుందర్‌, నన్ను ఇలా అందరినీ ప్రోత్సహించాడు. కోహ్లీ భాయ్‌ కెప్టెన్సీని ఎంతగా ఎంజాయ్‌ చేశానో..రహానే సారథ్యాన్ని కూడా అంతే ఆస్వాదించాను. ఇక నా ఫేవరెట్‌ వికెట్‌ గురించి చెప్పాలంటే.. మార్నస్‌ లబుషేన్‌దే. కీలక సమయంలో తీసిన ఆ వికెట్‌ నాకెంతో ప్రత్యేకం.

 ఇదే జోరు కొనసాగిస్తా..

ఇదే జోరు కొనసాగిస్తా..

'చాలా రోజుల తర్వాత ఇప్పుడే ఇంటికి వచ్చి ఇంటి భోజనం చేశా. అలా అని రిలాక్స్‌ అవ్వను. షమీ, ఉమేశ్‌ వచ్చిన తర్వాత కూడా మార్పు ఉండకపోవచ్చు. నిజానికి మేనేజ్‌మెంట్‌ ఎలా చెప్తే అదే నేను చేస్తాను. నేను ఇప్పుడు కూడా జూనియర్‌నే. అయితే ఆసీస్‌ విజయం ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతాను. మనసు పెట్టి ఆడతాను అంతే. కఠినశ్రమతో పాటు ఆటను గౌరవించడం నేర్చుకున్నా. నా కుటుంబం, స్నేహితులతో పాటు అభిమానులు నాకు అండగా నిలిచారు. ఇక ముందు కూడా వారి నుంచి ఇలాంటి మద్దతే కావాలి'అని అభిమానులకు సిరాజ్‌ విజ్ఞప్తి చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిరాజ్ మొత్తం 13 వికెట్లు తీశాడు. గబ్బా వేదికగా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

Story first published: Thursday, January 21, 2021, 19:20 [IST]
Other articles published on Jan 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X