న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంట్లో ఉండటం అంత ఈజీకాదు.. కానీ ఉండెటోడే హీరో: షమీ

Mohammed Shami urges everyone to stay indoors during 21-day Covid-19 lockdown

కోల్‌కతా: ఇంట్లో ఉండటం అంత సులువు కాదని, కానీ ఉండేవాడే నిజమైన హీరోనని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కోడానికి భారతీయులంతా 21 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని షమీ విజ్ఞప్తి చేశాడు.

దేశంలో వేగంగా విజృంభిస్తున్న కరోనాను ఎదుర్కునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాతర క్రికెటర్లు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఈ లాక్‌డౌన్‌పై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. కొందరూ క్రికెట్ భాషలోనే బయటకు వస్తే రనౌట్ అవుతారని, కరోనా చేతిలో మన్కడింగ్ గురువుతారని ఫన్నీ ట్వీట్ చేస్తున్నారు.

ధోనీ నీకిది తగునా.. రూ 800 కోట్ల ఆస్తి ఉన్న నీవు లక్ష రూపాయల విరాళమా?ధోనీ నీకిది తగునా.. రూ 800 కోట్ల ఆస్తి ఉన్న నీవు లక్ష రూపాయల విరాళమా?

ఈ నేపథ్యంలోనే మహ్మద్‌ షమీ ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేసి దేశ పౌరులు ఇంట్లోనే ఉండాలని కోరాడు. దానికి #GharBaithoIndia అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు. 'దేశ ప్రజలంతా ఇళ్లలోనే ఉండండి. ప్రస్తుతం మనం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం.

ఈ సమయం మనకెంతో కీలకం. ఇంట్లో కూర్చునే ప్రతీ ఒక్క పౌరుడు ఈ దేశానికి నిజమైన హీరో. హీరోగా ఉండడం అంత తేలిక కాదు. వైద్యులు చెప్పిన విషయాలను పాటించి అందరూ ఇళ్లలోనే ఉండమని మీరూ చెప్పండి. ధన్యవాదాలు' అని షమీ విజ్ఞప్తి చేశాడు. కరోనా దెబ్బతో ఇప్పటికే అన్నీ క్రీడా టోర్నీలు రద్దవ్వగా.. ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

Story first published: Friday, March 27, 2020, 16:38 [IST]
Other articles published on Mar 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X