న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ అద్భుత ప్రదర్శనే షమీని టాప్-10లో చోటు దక్కించుకునేలా చేసింది!

Mohammed Shami storms into top-10 in ICC Test bowlers rankings

హైదరాబాద్: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత పేసర్ మహ్మద్ షమీ బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్స్‌లో షమీ 10వ స్థానంలో ఉండగా... స్పిన్నర్ అశ్విన్ నాలుగో స్థానంలో... జస్ప్రీత్ బుమ్రా తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో షమీ మొత్తం 13 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 7 వికెట్లు తీసిన షమీ... ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన డే నైట్ టెస్టులో రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ICC Test rankings: స్మిత్ చెత్త ప్రదర్శనతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న కోహ్లీICC Test rankings: స్మిత్ చెత్త ప్రదర్శనతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న కోహ్లీ

 ఆడకున్నా... టాప్-10లోనే బుమ్రా

ఆడకున్నా... టాప్-10లోనే బుమ్రా

వెస్టిండీస్ పర్యటన నుండి టీమిండియా తరఫున ఆడని ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్-10లో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగినప్పటికీ... తాజాగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మూడవ భారత బౌలర్‌గా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రం అశ్విన్ నిలిచాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌ల్లో పేసర్లు షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లు తమ పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పోయించారు.

47 టెస్టులాడి 175 వికెట్లు తీసిన షమీ

47 టెస్టులాడి 175 వికెట్లు తీసిన షమీ

2013లో టెస్టు అరంగేట్రం చేసిన మహ్మద్ షమీ భారత్ తరుపున ఇప్పటివరకు 47 టెస్టులాడి 175 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఐదు వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ 830 రేటింగ్ పాయింట్లతో ఒక స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. ఇక, ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌తో అడిలైడ్ వేదికగా జరిగిన డే నైట్ టెస్టులో ఏడు వికెట్లు తీసిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ నాలుగు స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో నిలిచాడు.

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10 బౌలర్లు

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10 బౌలర్లు

1. పాట్ కమ్మిన్స్ - 900

2. కగిసో రబాడ - 839

3. జాసన్ హోల్డర్ - 830

4. నీల్ వాగ్నెర్ - 814

5. జస్‌ప్రీత్ బుమ్రా - 794

6. వెర్నాన్ ఫిలాండర్ - 783

7. జేమ్స్ ఆండర్సన్ - 782

8. జోష్ హాజిల్‌వుడ్- 776

9. ఆర్ అశ్విన్ - 772

10. మహ్మద్ షమీ - 771

Story first published: Wednesday, December 4, 2019, 16:02 [IST]
Other articles published on Dec 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X