For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎందుకు పరిగెట్టలేకపోతున్నావ్‌ అని లక్ష్మణ్‌పై అరిచా.. తర్వాత మా అన్నయ్య తిట్టాడు: సచిన్

I ended up shouting at Laxman: When Sachin lost his cool and was scolded by brother after desert storm match
Sachin Tendulkar Shouted On VVS Laxman. When & Why? | Oneindia Telugu

ముంబై: ఒకానొక సందర్భంలో తన సహచర ఆటగాడు, టెస్టు స్పెషలిస్టు వీవీఎస్‌ లక్ష్మణ్‌పై అరిచానని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ తెలిపాడు. ఆ టోర్నీ తర్వాత ఇంటికి వెళ్లిన సచిన్‌కి అతని సోదరుడు అజిత్ టెండూల్కర్ చివాట్లు పెట్టినట్లు వెల్లడించాడు. 1998లో షార్జాలో జరిగిన కోకొకోలా కప్‌ సందర్భంగా.. వికెట్ల మధ్య పరుగు విషయంలో లక్ష్మణ్‌‌‌పై సచిన్ తీవ్రంగా కోప్పడ్డాడట. అసలు విషయంలోకి వెళితే...

 భారత్ లక్ష్యంను 276:

భారత్ లక్ష్యంను 276:

1998 ఏప్రిల్ 22న షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ని 46 ఓవర్లకి కుదించిన అంపైర్లు.. భారత్ లక్ష్యంను 276 పరుగులుగా సవరించారు. ఓపెనర్‌గా ఆడిన సచిన్ టెండూల్కర్ (143: 131 బంతుల్లో 9x4, 5x6) ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. అయితే ఎండ్‌ నుండి మాత్రం అతనికి చెప్పుకోదగ్గ సహకారం లభించలేదు.

 కీలక భాగస్వామ్యం:

కీలక భాగస్వామ్యం:

ఒకవైపు సచిన్ క్రీజులో కుదురుకోగా... ఓపెనర్ సౌరవ్ గంగూలీ (17), నయాన్ మోంగియా (35), మహ్మద్ అజహరుద్దీన్ (14), అజయ్ జడేజా (1) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. కీలక సమయంలో లక్ష్మణ్ (23 నాటౌట్: 34 బంతుల్లో 1x4)తో కలిసి సచిన్ టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ జోడి ఐదో వికెట్‌కి 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే సచిన్‌తో కలిసి లక్ష్మణ్ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తలేకపోయాడు. దీంతో కోపోద్రిక్తుడైన సచిన్ లక్ష్మణ్‌పై అరిచాడట. నాటి మ్యాచ్‌ విషయాల్ని లిటిల్‌ మాస్టర్‌ ఇటీవల స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నాడు.

 ఎందుకు పరిగెట్టలేకపోతున్నావ్‌? అని అడిగా:

ఎందుకు పరిగెట్టలేకపోతున్నావ్‌? అని అడిగా:

సచిన్‌ టెండూల్కర్ మాట్లాడుతూ... 'ఆ రోజు జరిగిన ఘటన నాకింకా గుర్తుంది. మ్యాచ్‌ మధ్యలో రెండు, మూడు సార్లు లక్ష్మణ్‌పై అరిచాను. మ్యాచ్ కీలక దశలో ఉన్న సమయంలో లక్ష్మణ్కారణంగా సహనం కోల్పోయా. రెండు పరుగులు తియ్యాలని చెబుతున్నా.. వినలేదు. దగ్గర వెళ్లి ఎందుకు పరిగెట్టలేకపోతున్నావ్‌?.. అని గట్టిగా అడిగాను. అయితే ఇదే విషయంపై ఇంటికొచ్చాక నా సోదరుడితో చీవాట్లు తిన్నా. మైదానంలో మరోసారి ఇలాంటివి జరగకూడదు. లక్ష్మణ్‌ నీ సహచరుడు. అతను కూడా జట్టుకోసమే ఆడుతున్నాడు. అది నీ ఒక్కడి మ్యాచ్‌ కాదు అని అన్నయ్య కోపడ్డాడు' అని చెప్పాడు.

మ్యాచ్‌ గెలవడానికే తొలి ప్రాధాన్యతనిచ్చా:

మ్యాచ్‌ గెలవడానికే తొలి ప్రాధాన్యతనిచ్చా:

'ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గెలిచి గర్వంగా ఫైనల్‌కు వెళ్లాలనుకున్నా. గెలిచి ఫైనల్‌కు క్వాలిఫై అయితేనే.. తదుపరి మ్యాచ్‌కు మానసికంగా ధైర్యం వస్తుందని భావించా. అందుకే నేను మ్యాచ్‌ గెలవడానికే తొలి ప్రాధాన్యతనిచ్చా. ఒకవేళ అది కుదరకపోతే రన్‌రేట్‌తో అర్హత సాధించి తర్వాత ఫైనల్లో అయినా గెలవాలనుకున్నా. అదే నా ఆలోచన' అని సచిన్‌ వివరించాడు. ఆ మ్యాచ్‌లో చివరికి భారత్ 250 పరుగులు చేసి ఓటమిపాలైంది. రన్‌రేట్ ఆధారంగా ఫైనల్‌ చేరిన భారత్‌.. అక్కడ ఆసీస్‌ను ఓడించింది. ఫైనల్లోనూ సచిన్ ‌(134) మరో శతకం బాదాడు.

Story first published: Friday, May 1, 2020, 15:45 [IST]
Other articles published on May 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+