న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నావల్లే గౌతమ్ గంభీర్ కెరీర్ ముగిసింది.. పాక్ పేసర్ మహమ్మద్ ఇర్ఫాన్ షాకింగ్ కామెంట్స్!

Mohammad Irfan Says Gautam Gambhir was not able to see the ball in 2012 India vs Pakistan series

ఇస్లామాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌పై పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ ఇర్ఫాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ పరిమిత ఓవర్ల కెరీర్‌ను తానే అంతం చేశానని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబటి ఉన్నానని స్పష్టం చేశాడు. పాకిస్థాన్ 2012 భారత పర్యటనను గుర్తు చేసుకున్న ఇర్ఫాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఇక ఈ పర్యటనలో గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్‌లతో బలమైన బ్యాటింగ్ లైనప్‌ కలిగిన భారత్.. పాక్‌తో టీ20 సిరీస్‌ను 1-1తో సమంచేసుకుంది. వన్డే సిరీస్‌ను మాత్రం 1-2తో కోల్పోయింది. ఏడడుగుల ఇర్ఫాన్ ఈ టూర్‌లో భారత్ పతనాన్ని శాసించి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సిరీస్‌ను ప్రస్తావించిన ఇర్ఫాన్.. గంభీర్ కెరీర్ తానే అంతం చేశానన్నాడు. అయితే ఈ పర్యటనలో ఐదు మ్యాచ్‌లు ఆడిన గంభీర్ రెండు సార్లు ఇర్ఫాన్ చేతిలో ఔటయ్యాడు.

దీనిపై తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌లో వివరణనిచ్చిన ఇర్ఫాన్.. 2012 సిరీస్‌లో తను విసిరిన బౌన్సర్లను గంభీర్ ఎదుర్కోలేకపోయాడని తెలిపాడు. 'సాధారణంగా పాక్-భారత్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా.. ఇరు జట్లలో విఫలమైన ఆటగాళ్లు జీరోలు అవుతే.. రాణించిన ఆటగాళ్లు హీరోలు అవుతారు. 2012 పర్యటనలో నేను వేసిన బంతులను గంభీర్ కనీసం చూడలేకపోయాడు. బౌన్సర్లు ఆడలేక ఇబ్బంది పడ్డారు.

ఇది చూసిన వాళ్లంతా గంభీర్ ఆట అతనిలా లేదన్నారు. నా హైట్, బౌలింగ్ వల్ల అతను తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. దాంతో గంభీర్ జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత పునరాగమనం చేసినా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పాకిస్థాన్‌తో గంభీర్ ఆడిన చివరి సిరీస్ అదే. అందుకే నా వల్లే గంభీర్ కెరీర్ అంతమైందని చెప్పా'అని ఇర్ఫాన్ వివరణ ఇచ్చాడు.

ఇక భారత్ గెలిచిన రెండు ప్రపంచకప్‌లలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. భారత్ తరఫున 58 టెస్ట్‌ల్లో 41.85 సగటుతో 4154 పరుగులు చేసిన ఈ మాజీ ఓపెనర్.. 147 వన్డేల్లో 5,238 రన్స్ చేశాడు. ఇక 37 టీ20ల్లో 932 పరుగులు సాధించాడు.

ఇమ్రాన్ ఖాన్‌.. నువ్వు ఓ దేవుడివని విర్రవీగుతున్నావ్: జావేద్ మియాందాద్‌ఇమ్రాన్ ఖాన్‌.. నువ్వు ఓ దేవుడివని విర్రవీగుతున్నావ్: జావేద్ మియాందాద్‌

Story first published: Thursday, August 13, 2020, 11:01 [IST]
Other articles published on Aug 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X