న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నాపై తప్పుడు ప్రచారం చేశారు.. రిటైర్మెంట్‌కు వారే కారణం.. అందుకే ప్రజలముందుకు వచ్చా'

Mohammad Amir says Current PCB management is responsible for his retirement

కరాచీ: 28 ఏళ్లకే తాను రిటైర్మెంట్‌ ప్రకటించడానికి పాకిస్థాన్‌ జట్టు యాజమాన్యమే కారణమని ఆ జట్టు స్టార్ పేసర్‌ మహ్మద్ అమీర్ ఆరోపించాడు. పాకిస్తాన్ హెడ్ కోచ్‌ మిస్బాఉల్‌ హక్‌, బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌ తనపై తప్పుడు ప్రచారం చేశారన్నాడు. ఏ ఆటగాడైనా పేరు సంపాదించడం చాలా కష్టమని అమీర్ పేర్కొన్నాడు. మూడు రోజుల క్రితం అమీర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ పెడుతున్న టార్చర్ భరించలేక ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

నాపై అసత్య ప్రచారాలు

నాపై అసత్య ప్రచారాలు

తాజాగా యూట్యూబ్‌ ఛానెల్‌లో మహ్మద్ అమీర్ మాట్లాడుతూ... 'నేను టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి సమస్య మొదలైంది. 2019 ప్రపంచకప్ తరువాత అంతా బాగానే ఉంది. అప్పటి కోచ్ మిక్కీ ఆర్థర్ నాతో బాగా ఉన్నారు. నా రిటైర్మెంట్ (టెస్టులకు) నిర్ణయాన్ని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత పీసీబీ నిర్వహణలో కొంతమంది సభ్యులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంతా మారిపోయింది. వైట్ బాల్ క్రికెట్ కోసం పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్కడ టెస్ట్ సిరీస్లో పాకిస్తాన్ ఓడిపోయినప్పుడు హెడ్ కోచ్ మరియు బౌలింగ్ కోచ్ నాపై అసత్య ప్రచారాలు చేశారు' అని అన్నాడు.

నా ఇమేజ్‌ను నాశనం చేశారు

నా ఇమేజ్‌ను నాశనం చేశారు

'ఆస్ట్రేలియా పర్యటన నుంచి ప్రధాన కోచ్‌ మిస్బాఉల్‌ హక్‌, బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌ జట్టులో నాపై తప్పుడు ప్రచారం చేశారు. నాకు టెస్టు క్రికెట్ ఆడటంలో ఆసక్తి లేదని, డబ్బు కోసమే టీ20 లీగులు ఆడతున్నాననే విష ప్రచారం చేశారు. టీ20 లీగుల కోసం పాకిస్తాన్ తరఫున వన్డేలు, టీ20లు ఆడనని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఏ ఆటగాడైనా పేరు సంపాదించడం చాలా కష్టం. నా ఇమేజ్‌ను వాళ్ళు నాశనం చేశారు. ప్రజలు నా గురించి మాట్లాడటం ప్రారంభించారు. నాకు ఎవరితో సమస్యలు లేవు. ఆటగాళ్లతో సరిగా వ్యవహరించని పీసీబీ మేనేజ్‌మెంట్‌తోనే నాకు అసలు సమస్య' అని మహ్మద్ అమీర్ తెలిపాడు.

ఇంతకుమించి ఏం చేయాలి

ఇంతకుమించి ఏం చేయాలి

'ఇలా బయటకు రావడం మంచిది కాదు. కానీ నేను భరించలేకే ప్రజలముందుకు వచ్చా. నాకు మిస్బా, యూనిస్‌తోనే వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే అసలేం జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనుకున్నా. న్యూజిలాండ్‌ పర్యటనకు 35 మందిలో నన్ను ఎంపిక చేయలేదు. ఒకవేళ నిజంగా నేను టీ20 లీగ్‌ల మీదే ఆసక్తి చూపిస్తే.. ఈ విషయంపై బాధపడాల్సిన అవసరం నాకు లేదు. ఒక సీనియర్‌ ఆటగాడిగా నన్ను జట్టులో కొనసాగించాలా వద్దా అనే విషయంపై ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోయారు. నేను ఆసియా కప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ, గతేడాది వన్డే ప్రపంచకప్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేశా. ఇప్పటికీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కొనసాగుతున్నా. ఇంతకుమించి ఏం చేయాలి. జాతీయ జట్టుకు ఎంపిక చేయనప్పుడు లీగ్‌ మ్యాచ్‌లు ఆడకుండా ఏం చేయాలి. ఆ రకంగా అయినా నా ప్రతిభను చాటాలనుకున్నా' అని అమీర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఏడాదిలోనే పాక్ అత్యుత్తమ బౌలర్‌గా

ఏడాదిలోనే పాక్ అత్యుత్తమ బౌలర్‌గా

2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన మహ్మద్ అమీర్.. ఏడాదిలోనే పాక్ అత్యుత్తమ బౌలర్‌గా ఎదిగాడు. ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. అయితే 2010లో ఇంగ్లాండ్ పర్యటనలో స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. దాంతో అమీర్ కెరీర్ ముగిసిపోయిందని అంతా ఊహించారు. కానీ 2015-2016‌లో మళ్లీ పాక్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అమీర్.. అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదిగాడు. గత ఏడాది అనూహ్యంగా టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా పాకిస్థాన్ క్రికెట్ పెద్దలకి కోపం తెప్పించాడు. అప్పటి నుంచి పీసీబీ నుంచి కూడా అతనికి మొండిచేయి ఎదురవుతూ వచ్చింది. పాక్ తరఫున 36 టెస్టులాడిన అమీర్ 119 వికెట్లు పడగొట్టాడు. 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున ఈ ఏడాది ఆగస్టు‌లో చివరగా టీ20 మ్యాచ్ ఆడాడు.

ISL 2020 21: ముంబై జైత్రయాత్ర.. హైదరాబాద్‌కు ఓటమి!!

Story first published: Monday, December 21, 2020, 9:20 [IST]
Other articles published on Dec 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X