న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2020: 'టైటిల్ గెలవడానికి కోహ్లీ, ఏబీపై అతిగా ఆధారపడొద్దు'

IPL 2020: RCB Can't Just Rely On Virat Kohli And AB de Villiers To Win : Moeen Ali | Oneindia Telugu
Moeen Ali Says RCB Can’t Just Rely On Virat Kohli And AB de Villiers To Win The Title

హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టైటిల్ గెలవడానికి విరాట్ కోహ్లీ, ఏహీ డివిలియర్స్‌పై ఎక్కువగా ఆధారపడొద్దని ఆ జట్టు స్టార్ స్పిన్నర్ మొయిన్ అలీ అభిప్రాయపడ్డాడు. దిగ్గజ క్రికెటర్లు ఎందరో ఉన్నప్పటికీ ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. దీంతో వచ్చే సీజన్‌లోనైనా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఆ జట్టు ఉంది.

ఐపీఎల్‌లో ఇప్పటికే 12 సీజన్లు ముగిసినప్పటికీ కనీసం ఒక్కసారి కూడా ఆర్సీబీ విజేతగా నిలవలేకపోయింది. ఈ నేపథ్యంలో మొయిన్ అలీ మాట్లాడుతూ "మాకు శుభారంభం అవసరం. మేమెప్పుడూ నిదానంగా జోరందుకుంటాం. ముఖ్యంగా సొంతమైదానంలో మేం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే చిన్నస్వామి వికెట్‌ చాలా బాగుంటుంది. బౌండరీ సరిహద్దులు చిన్నవి. ఇది బౌలర్లను భయపెడుతుంది" అని అన్నాడు.

IPL 2020: వచ్చే సీజన్‌లో కప్ కొట్టాలనే, అత్యధికంగా 12 మంది విడుదల చేసిన ఆర్సీబీIPL 2020: వచ్చే సీజన్‌లో కప్ కొట్టాలనే, అత్యధికంగా 12 మంది విడుదల చేసిన ఆర్సీబీ

మ్యాచులు గెలిచేందుకు

మ్యాచులు గెలిచేందుకు

"మ్యాచులు గెలిచేందుకు మేం ప్రతిసారీ విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌పై ఆధారపడకూడదు. నాతో సహా కొత్తగా వచ్చే బ్యాటర్లు బాధ్యత తీసుకోవాలి. చక్కగా బ్యాటింగ్‌ చేయాలి" అని మొయిన్‌ అలీ అన్నాడు. కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) అత్యధికంగా 12 మందిని విడుదల చేసింది.

కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లను మాత్రమే

కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లను మాత్రమే

ఐపీఎల్ 2020 సీజన్ కోసం అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాని విడుదల చేసిన ఆర్సీబీ, కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లకి మాత్రమే అట్టిపెట్టుకుంది. అందులో ఒకరు ఏబీ డివిలియర్స్‌కాగా.. రెండో ఆటగాడు మొయిన్ అలీ. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను ఆయా ఫ్రాంఛైజీలు వేలానికి విడుదల చేశాయి. మొత్తంగా 8 జట్లు 71 మంది ప్లేయర్లను వేలానికి విడుదల చేశాయి.

వేలానికి విడుదల చేసిన ఆటగాళ్లు:

వేలానికి విడుదల చేసిన ఆటగాళ్లు:

మార్కస్‌ స్టొయినిస్‌, షిమ్రన్ హెట్‌మెయిర్‌, అక్షదీప్‌ నాథ్‌, నేథన్‌ కౌల్టర్‌నైల్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, ప్రయాస్‌ బర్మన్‌, టిమ్‌ సౌథీ, కుల్వంత్‌ కేజ్రోలియా, హిమ్మత్‌ సింగ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, మలింగ్‌ కుమార్‌, డేల్‌ స్టెయిన్‌

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు:

విరాట్ కోహ్లి, మొయిన్ అలీ, చాహల్, పార్థీవ్ పటేల్, సిరాజ్, ఉమేశ్ యాదవ్, పవన్ నేగి, పాడిక్కల్, గుర్‌కీరత్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, నవదీప్ షైనీ, ఏబీ డివిలియర్స్.

ఆర్సీబీ వద్ద మిగిలిన నగదు

ఆర్సీబీ వద్ద మిగిలిన నగదు

ఐపీఎల్ 2019 వేలం తర్వాత రాయల్స్ ఛాలెజర్స్ వారి పర్సులో రూ .1.8 కోట్లు మిగిలి ఉన్నాయి. 12 మంది ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా ఆర్సీబీ రూ. 23 కోట్లకు పైగా సంపాదించింది. మరోవైపు బిసిసిఐ నుండి అదనంగా 3 కోట్ల రూపాయలు రానున్నాయి. దీంతో వచ్చే సీజన్‌లో జరిగే ఐపిఎల్ 2020 వేలంలో రూ. 27.9 కోట్లు ఖర్చు చేయవచ్చు.

Story first published: Tuesday, November 19, 2019, 12:27 [IST]
Other articles published on Nov 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X