'స్పోర్ట్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌'గా నిలిచిన మిథాలీ రాజ్

Posted By:
Mithali Raj adjudged Sportsperson of the Year; PV Sindhu, Kidambi Srikanth win best athlete awards

హైదరాబాద్: మహిళల క్రికెట్‌లో రికార్డులమోత మోగిస్తున్న భారత వన్డే జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ 2017 ప్రతిభ ఆధారంగా స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా నిలిచింది. తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో క్రీడలలో విశేషంగా రాణించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులకు పురస్కారాలను అందజేశారు.

సింధు, కిదాంబి శ్రీకాంత్, ఎర్రదీక్షిత తదితరులకు అవార్డులు అందించారు. 'స్పోర్ట్ పర్సన్ ఆఫ్ ద ఇయర్'గా ఎంపికైన మిథాలీ రాజ్ అవార్డుల ప్రదానోత్సవానికి అందుబాటులో లేకపోవడంతో ఆమె తల్లితండ్రులు అవార్డును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు నుంచి అందుకున్నారు. పీవి సింధు, కిదాంబి శ్రీకాంత్ సీనియర్ మహిళా, పురుషుల విభాగంలో ఉత్తమ షట్లర్లుగా అవార్డులు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో సానియా మీర్జా చేతులమీదుగా సింధు అవార్డు అందుకోగా, వీవీఎస్ లక్ష్మణ్ చేతులమీదుగా కిదాంబి శ్రీకాంత్ అందుకున్నాడు.

మూడు సార్లు ఒలింపిక్స్‌లో ఆడిన మాజీ జాతీయ హాకీ ఆటగాడు ముకేశ్‌కుమార్‌కు జీవితసాఫల్య పురస్కార అవార్డును దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలోనే హైదరాబాద్ క్రికెట్ టీమ్‌ను టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. దీనిని జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఎమ్మెస్కే ప్రసాద్ చేతుల మీదుగా ప్రదానం చేశారు.


అద్భుత నైపుణ్యం ప్రదర్శించిన అథ్లెట్‌గా జిమ్నాస్ట్ అరుణారెడ్డికి అవార్డు అందజేసి ఇలాంటి విజయాలను మరెన్నో అందుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఆమెనుద్దేశించి కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెస్కే ప్రసాద్, పాపారావు క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Sunday, April 1, 2018, 12:23 [IST]
Other articles published on Apr 1, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి