న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఉయ్ విల్ మిస్ యూ ధోనీ'

India vs Australia 2018-19 : Dhoni Fans Get Upset By Bcci Selection For 1st T20I | Oneindia Telugu
Miss you Thala, tweet MS Dhoni fans as Rishabh Pant replaces him as wicket-keeper for 1st T20I

హైదరాబాద్: రెండు నెలల పాటు జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తొలి మ్యాచ్‌కు సిద్ధమైపోయింది. ఈ క్రమంలో నవంబరు ఆదివారం జరగనున్న మొదటి టీ20 ఆడేందుకు టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. దీంతో రిషబ్ పంత్‌కు స్థానం కల్పిస్తూ.. ధోనీకి ఈ టీ20లో విశ్రాంతినిస్తుండటం ఖరారు అయిపోయింది. ఆ జట్టు ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు ఆన్ లైన్ వేదికగా బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు.

12 మందితో కూడిన జట్టుని ప్రకటించిన బీసీసీఐ

12 మందితో కూడిన జట్టుని ప్రకటించిన బీసీసీఐ

బ్రిస్బేన్ వేదికగా బుధవారం జరగనున్న తొలి టీ20 కోసం భారత్ జట్టుని బీసీసీఐ మంగళవారం ప్రకటించగా.. ‘మిస్ యూ ధోని' అంటూ పలు ట్వీట్ల ద్వారా తమలోని భావాలను కామెంట్ చేస్తున్నారు. ఇలా ధోనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ బాధని వ్యక్తపరుస్తున్నారు. 12 మందితో కూడిన జట్టుని మంగళవారం ప్రకటించిన బీసీసీఐ.. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ని ఎంపిక చేసింది.

ఉయ్ విల్ మిస్ యూ ధోని

దీంతో.. సుదీర్ఘకాలంగా టీమిండియా వికెట్ కీపర్‌‌గా ధోనీ పేరుని చూస్తున్న అతని అభిమానులు ‘ఉయ్ విల్ మిస్ యూ ధోని' అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ధోని వచ్చే ఏడాది జనవరి వరకూ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం లేదు. అది కూడా ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కి ఎంపికైతేనే కుదరదు.

కీపర్‌గా అవకాశముందుకున్న రిషబ్ పంత్‌

ఈ ఏడాది ఇంగ్లాండ్ గడ్డపై వన్డే, టీ20ల్లో బ్యాట్‌తో నిరాశపరిచిన ధోని.. ఆ తర్వాత ఆసియా కప్, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. దీంతో.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ నుంచి ధోనీని తప్పించిన సెలక్టర్లు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి అవకాశమిచ్చారు. అతను వెస్టిండీస్‌పై ఆఖరి టీ20 మ్యాచ్‌లో అర్ధశతకంతో సత్తాచాటాడు. దీంతో.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో‌నూ రిషబ్ పంత్‌కి టీమిండియా మేనేజ్‌మెంట్ మరో అవకాశం ఇవ్వనుంది.

బీసీసీఐ ప్రకటించిన భారత్ జట్టు

తొలి టీ20కి బీసీసీఐ ప్రకటించిన భారత్ జట్టు ఇదే: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, చాహల్

Story first published: Tuesday, November 20, 2018, 16:06 [IST]
Other articles published on Nov 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X