ఆ జట్టు ఘోరంగా విఫలమైతే సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే టైటిల్: మైకేల్ వాన్

IPL 2021 : Michael Vaughan Predicts Winner Of IPL 2021 || Oneindia Telugu

లండన్: ఘన చరిత్ర ఉన్న చెన్నై సూపర్​ కింగ్స్​ తడబాటు.. అంచనాలే లేని ఢిల్లీ క్యాపిటల్స్‌‌ అద్భుత పెర్ఫామెన్స్‌‌.. తిరుగులేని ఆటతో ముంబై ఇండియన్స్‌‌ ఐదోసారి టైటిల్‌‌ దక్కించుకున్న క్షణాలు.. ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి..! కరోనా కారణంగా జరుగుతుందో లేదో అనుకున్న 13వ ఎడిషన్‌‌ యునైటెడ్‌‌ అరబ్‌‌ ఎమిరేట్స్‌‌ గడ్డపై అందించిన వినోదాన్ని మరచిపోకముందే ఐపీఎల్‌‌ హంగామా మళ్లీ మొదలైంది..! ఆరు నెలలు తిరగకుండానే క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌కు కిక్ ఇచ్చేందుకు మెగా లీగ్‌‌ మళ్లీ ముస్తాబైంది..! మొన్నటిదాకా నేషనల్‌‌ డ్యూటీలో నిమగ్నమైన ఇండియా స్టార్స్‌‌.. ఇప్పుడు తమ ఫ్రాంచైజీల జెర్సీలు ధరించి టీమ్‌‌మేట్స్‌‌తోనే అమీతుమీకి రెడీ అవుతున్నారు..! ఇండియన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ పద్నాలుగో ఎడిషన్‌‌ మరో రెండు రోజుల్లోనే మన ముందుకు రాబోతోంది..!

ఇప్పటికే ఆయా జట్లన్నీ సన్నాహకాలతో పాటు సోషల్ మీడియా వేదికగా క్యాంపైన్ మొదలుపెట్టాయి. మరోవైపు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ట్విటర్ వేదికగా ఐపీఎల్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఈ సీజన్ ప్రారంభమవ్వకముందే టైటిల్ గెలిచే జట్టేదో చెప్పేసాడు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్సే ఈసారి కూడా టైటిల్ గెలిచి సిక్సర్ కొడుతుందని మైకేల్ వాన్ అంచనా వేసాడు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఆ జట్టు గ్రహచారం బాగలేక చిత్తుగా ఓడితే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ ఎగరేసుకుపోతుందని మైకేల్ వాన్ జోస్యం చెప్పాడు.

'నా అంచనా చాలా ముందుగా చెప్తున్నానేమో.. ఈసారి కూడా ముంబై ఇండియన్సే టైటిల్ గెలుస్తుంది. ఒకవేళ ఆ జట్టు గ్రహచారం బాలేక దారుణంగా విఫలమైతే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ ఎగరేసుకుపోతుంది'అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే మైకేల్ వాన్ ప్రిడిక్షన్‌పై చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మాత్రానికి టోర్నీ ఆడుడేందుకని చురకలంటిస్తున్నారు. శుక్రవారం(ఏప్రిల్) 9న ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుండగా.. ఫస్ట్ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 7, 2021, 16:27 [IST]
Other articles published on Apr 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X