న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs SRH: ముంబై కొంపముంచిన రనౌట్.. మలుపుతిప్పిన భువీ మెయిడిన్ ఓవర్! సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం!

MI vs SRH: Rahul Tripathi, Umran Malik shine as Sunrisers Hyderabad beat Mumbai Indians by 3 runs

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ పరాజయాల పరంపరకు ఎట్టకేలకు ముగింపు పలికింది. వరుసగా 5 ఓటముల తర్వాత తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్నందుకుంది. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 3 పరుగుల తేడాతో గెలుపొందింది. అనేక మలుపులు తిరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ డేవిడ్ రనౌట్ ముంబై ఇండియన్స్ కొంపముంచగా.. భువనేశ్వర్ కుమార్ వేసిన వికెట్ విత్ మెయిడిన్ 19వ ఓవర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు విజయాన్నందించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి.

అనేక మలుపులు..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి(44 బంతుల్లో 3సిక్స్‌లు, 9 ఫోర్లతో 76) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ప్రియామ్ గార్గ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), నికోలస్ పూరన్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38) ధాటిగా ఆడారు. ముంబై బౌలర్లలో రమన్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. డానియల్ సామ్స్, రిలే మెరిడిత్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ(36 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48), ఇషాన్ కిషన్(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 43), టీమ్ డేవిడ్ (18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) రాణించినా ఫలితం లేకపోయింది.

హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీయగా.. సుందర్, భువీ చెరొక వికెట్ పడగొట్టాడు.

సూపర్ స్టార్ట్...

194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. ఆరంభం నుంచి హైదరాబాద్ బౌలర్లపైకి ఎదురు దాడికి దిగిన ఈ జోడీ భారీ షాట్లతో విరుచుకుపడింది. ముఖ్యంగా రోహిత్ శర్మ భారీ సిక్సర్లతో విరుచకుపడ్డాడు. దాంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా ముంబై 51 పరుగులు చేసింది. ఈ తర్వాత కూడా ఈ జోడీ వేగం తగ్గలేదు. వరుసగా బౌండరీలు తరలిస్తూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు.

వరుసగా వికెట్లు కోల్పోయి..

అయితే హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను వాషింగ్టన్ సుందర్ సూపర్ డెలివరీతో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఊరించే బంతితో రోహిత్‌ను టెంప్ట్ చేసి బుట్టలోవేసుకున్నాడు. దాంతో 95 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ సైతం భారీ షాట్‌ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక ఉమ్రాన్ తన మరుసటి ఓవర్‌లో తిలక్ వర్మ(8), డానియల్ సామ్స్(15)లను కూడా ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ట్రిస్టాన్ స్టబ్స్.. దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు.

టీమ్ డేవిడ్ రనౌట్..

నటరాజన్ వేసిన 18వ ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు బాదిన టీమ్ డేవిడ్.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కానీ అదే ఓవర్ చివరి బంతికి టీమ్ డేవిడ్ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. చివరి 12 బంతుల్లో ముంబై విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. భువనేశ్వర్ వికెట్‌తో పాటు మెయిడిన్ చేశాడు. చివరి ఓవర్‌లో ఫరూఖి 15 పరుగులివ్వడంతో సన్‌రైజర్స్ విజయం లాంఛనమైంది.

Story first published: Tuesday, May 17, 2022, 23:43 [IST]
Other articles published on May 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X