న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs SRH: చెలరేగిన త్రిపాఠి, ప్రియామ్ గార్గ్.. ముంబై ముందు భారీ లక్ష్యం!

MI vs SRH: Rahul Tripathi and Priyam Garg helps Hyderabad set to 194 target fo Mumbai

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 194 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాహుల్ త్రిపాఠి(44 బంతుల్లో 3సిక్స్‌లు, 9 ఫోర్లతో 76) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ప్రియామ్ గార్గ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), నికోలస్ పూరన్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38) ధాటిగా ఆడారు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో రమన్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. డానియల్ సామ్స్, రిలే మెరిడిత్ తలో వికెట్ పడగొట్టారు. 16.5 ఓవర్లలోనే 170 పరుగుల మార్క్ అందుకున్న సన్‌రైజర్స్ 200 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ చివరి మూడు ఓవర్లు ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్ జోరును అడ్డుకుంది.

చెలరేగిన ప్రియామ్ గార్గ్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనింగ్ జోడీని మార్చినా కలిసిరాలేదు. రెగ్యూలర్ ఓపెనర్ అభిషేక్ శర్మకు తోడుగా కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు బదులు యువ ప్లేయర్ ప్రియామ్ గార్గ్‌ బరిలోకి దిగాడు. అయితే ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే అభిషేక్ శర్మ(9)ను డానియల్ సామ్స్ పెవిలియన్ చేర్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి ప్రియామ్ గార్గ్ చెలరేగాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. త్రిపాఠి సైతం జోరు కనబర్చడంతో హైదరాబాద్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది.

రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీ..

అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. అయితే హాఫ్ సెంచరీకి చేరువైన ప్రియామ్ గార్గ్(42)ను రమణ్ దీప్ సింగ్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్.. వస్తూ వస్తూనే బౌండరీతో మొదలుపెట్టాడు. మెరిడిత్ వేసిన 13వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన పూరన్.. మార్కండే వేసి మరుసటి ఓవర్‌లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. అదే ఓవర్‌లో క్విక్ సింగిల్‌తో త్రిపాఠి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

భారీ షాట్లు ఆడే క్రమంలో..

ఆ తర్వాత ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదారు. అయితే ధాటిగా ఆడే క్రమంలో నికోలస్ పూరన్.. మెరిడిత్ బౌలింగ్‌లో మార్కండే సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే రమన్‌దీప్ వేసిన మురసటి ఓవర్‌లో రాహుల్ త్రిపాఠి కూడా భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత మార్కర్‌మ్ కూడా భారీ షాట్ ఆడే క్రమంలో వికెట్ ఇచ్చుకున్నాడు. వెనువెంటనే వికెట్లు కోల్పోవడంతో సన్‌రైజర్స్ పరుగుల వేగం తగ్గింది. బుమ్రా వేసిన చివరి ఓవర్‌లో కేన్ మామ బౌండరీ బాదడంతో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో సన్‌రైజర్స్ 200 పరుగుల మార్క్‌ను ధాటలేకపోయింది.

Story first published: Tuesday, May 17, 2022, 21:36 [IST]
Other articles published on May 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X