న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భౌతిక దూరం రూల్ నేపథ్యంలో ఫస్ట్ స్లిప్ పెట్టుకోవచ్చా..? జోక్ చేసిన ధోనీ!

MI vs CSK match 1: MS Dhoni jokes after winning toss in IPL 2020 opener

అబుదాబి: కరోనాను పక్కనబెడుతూ.. కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు ఇండియన్స్ ప్రేమించే లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ మనముందుకు వచ్చేసింది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, త్రీటైమ్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అబుదాబి వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేపట్టింది. ధాటిగా ప్రారంభించిన ఆ జట్టు ఆదిలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ(12), క్వింటన్ డికాక్(33) వికెట్లు కోల్పోయింది.

మహీ జోక్ నవ్వులే.. నవ్వులు

మహీ జోక్ నవ్వులే.. నవ్వులు

అయితే టాస్ సందర్బంగా చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చేసిన జోక్ అందరికి నవ్వు తెప్పించింది. హోస్ట్ మురళీకార్తీక్‌తో మహీ ఆడిన పరిహాసం ఆకట్టుకుంటుంది. కరోనా కారణంగా భౌతిక దూరం పాటించాలని నిబంధనల్లో పేర్కొన్నారని, మరీ ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డర్‌ను పెట్టుకోవచ్చా? అని చిలిపిగా ప్రశ్నిస్తూ మహీ జోక్ చేశాడు. ఇదే విషయంపై మ్యాచ్ రిఫరీని కూడా అడిగానని తెలిపాడు. దాదాపు ఏడాది ఆటకు దూరమైన మహీ ఈ మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగాడు. ఆగస్టు 15 19.29కి అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహీ.. 19.30కు రీఎంట్రీ ఇచ్చాడు.

మంచు ప్రభావంతో

మంచు ప్రభావంతో

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహీ మంచు ప్రభావం కారణంగా బౌలింగ్ ఎంచుకుంటున్నట్ల తెలిపాడు. విదేశీ ఆటగాళ్లలో డూప్లెసిస్, సామ్ కరన్, లుంగి ఎంగిడి, షేన్ వాట్సన్ తుది జట్టులోకి తీసుకున్నామన్నాడు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తొలి 6 రోజుల క్వారంటైన్ చాలా కష్టంగా గడిచిందని, ప్రాక్టీస్‌కు కల్పించిన వసతులు బాగున్నాయని చెప్పుకొచ్చాడు.

ఫోర్‌తో షురూ..

ఫోర్‌తో షురూ..

ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ప్రారంభించారు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన రోహిత్.. తన ఆటను ధాటిగానే మొదలుపెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ తొలి ఓవర్ తొలి బంతిని కవర్ అండ్ పాయింట్ దిశగా రోహిత్ బౌండరీకి తరలించాడు. అనంతరం కూడా ఈ ఇద్దరు ధాటిగా ఆడారు. కరోనాను జయించిన దీపక్ చాహర్ పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపించాడు.

రోహిత్, డికాక్ ఔట్

రోహిత్, డికాక్ ఔట్

ఇక పియూష్ చావ్లా వేసిన నాలుగో ఓవర్ నాలుగో బంతిని రోహిత్ మిడాఫ్ దిశగా షాట్‌కు ప్రయత్నించి సామ్ కరణ్ చిక్కాడు. దీంతో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన రోహిత్ ఇన్నింగ్స్ 12 పరుగులకే ముగిసింది. ఓపెనింగ్ జోడీని విడదియ్యాలనే ధోనీ వ్యూహాం ఫలించింది. ఆ వెంటనే సామ్ కరన్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ క్వింటన్ డికాక్(33) కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో ముంబై 5.1 ఓవర్లలో 48 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయింది.

సన్‌‌రైజర్స్ హైదరాబాద్ బెస్ట్ ఎలెవన్ ఎంపిక చేసిన సునీల్ గవాస్కర్.. ఆ స్టార్ ఆటగాడికి దక్కని చోటు!

Story first published: Saturday, September 19, 2020, 20:18 [IST]
Other articles published on Sep 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X