న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Chetan Sakariya: అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన టెంపో డ్రైవర్ కొడుకు.. అతని వెనుక ఓ విషాద గాధ!

Meet Chetan Sakariya- who overcame personal tragedy to make it to the IPL 2021

ముంబై: ఐపీఎల్ 2021 మినీ వేలంలో కోట్లు పలికి అందరి దృష్టిని ఆకర్షించిన ఓ టెంపో డ్రైవర్ కొడుకు.. తాజాగా తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టి ఔరా అనిపించాడు. ప్రత్యర్థి జట్టు సునామీ ఇన్నింగ్స్ ముందు వరల్డ్ బెస్ట్ బౌలర్లు చేతులెత్తేసిన వేళ.. పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఈ కుర్రాడు తన ఫస్ట్ మ్యాచ్‌లోనే సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ప్రత్యర్థి జోరును అడ్డుకున్నాడు. అతనిపై ఫ్రాంచైజీ పెట్టిన(రూ.కోటి 20 లక్షలు) డబ్బులకు తొలి మ్యాచ్‌లోనే న్యాయం చేశాడు. అతనెవరో కాదు.. పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సూపర్బ్ బౌలింగ్‌తో పాటు స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న చేతన్ సకారియా!

సూపర్ పెర్ఫామెన్స్..

సూపర్ పెర్ఫామెన్స్..

ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సకారియా 31 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను తన సెకండ్ ఓవర్‌లోనే ఔట్ చేసిన సకారియా చివరి ఓవర్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్(91), జైరిచర్డ్‌సన్(0)ను ఔట్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో సికర్ల వర్షం కురవగా.. సకారియా ఒక్కడే ఒక్క సిక్స్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఇక మెరుగైన బౌలింగ్‌తోడు సన్నింగ్ క్యాచ్‌తో సకారియా ఔరా అనిపించాడు. సూపర్ డైవ్‌తో పంజాబ్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. షార్ట్ ఫైన్ లెగ్ సూపర్ డైవ్‌తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఈ సూపర్ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

 సకారియా వెనుక విషాద గాధ..

సకారియా వెనుక విషాద గాధ..

సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చి అందరి చేత శెభాష్ అనిపించుకున్న చేతిన్ సకారియా వెనుక ఓ విషాద గాధ ఉంది. ఐపీఎల్ వేలానికి ముందు అతని తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ టైమ్‌లో సకారియా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్నాడు. అయితే ఈ విషాద వార్తను వారి తల్లిదండ్రులు సకారియాకు చెప్పలేదు. తమ్ముడంటే సకారియాకు చాలా ఇష్టమని, అతను ఎక్కడ డిస్టర్బ్ అవుతాడోనని ఈ విషయం చెప్పలేదని వారి తల్లిదండ్రులు మీడియాకు తెలియజేశారు.

తమ్ముడి మరణం..

తమ్ముడి మరణం..

ఇక ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన తర్వాత సకారియా కూడా తన తమ్ముడు లేని విషయాన్ని మీడియాకు తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు.'ఇప్పుడు నా తమ్ముడు బతికి ఉంటే నాకంటే ఎక్కువ సంతోషించేవాడు. జనవరిలో నేను ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆడడానికి వెళ్లినప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఇంటికి వచ్చే వరకు ఎవరూ ఈ విషయం చెప్పలేదు. టోర్నీలో ఆడుతున్నన్ని రోజులు రాహుల్‌ ఎక్కడున్నాడని ఇంట్లోవాళ్లను అడిగితే.. ఏదో పనిమీద బయటకు వెళ్లాడని సాకులు చెప్పేవాళ్లు. అతను చనిపోయాడనే విషయం కూడా తెలియనివ్వలేదు. ఇంటికి వెళ్లాకే అసలు విషయం తెలిసింది. నా తమ్ముడు లేని లోటు పూడ్చలేనిది." అని చేతన్‌ కన్నిటీ పర్యంతమయ్యాడు.

మా నాన్న టెంపో డ్రైవర్..

మా నాన్న టెంపో డ్రైవర్..

ఇక ఇంత డబ్బు ఏం చేస్తావని చాలా మంది అడుగుతున్నారని, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నట్లు ఈ లెఫ్టార్మ్ పేసర్ తెలిపాడు. 'మా నాన్న టెంపోవ్యాన్‌ డ్రైవర్‌. మాది చాలా పేద కుటుంబం. ఎంతలా అంటే గత ఐదేళ్ల కిందట మాకు కనీసం టీవీ కూడా లేదు. క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు స్నేహితుల ఇంటికో.. లేక టెలివిజన్ షో రూమ్స్‌లకో వెళ్లి చూసేవాడిని. ఇప్పుడు ఇంత మొత్తం వచ్చేసరికి.. ఆ డబ్బుతో ఏం చేస్తావని అంతా అడుగుతున్నారు. తొలుత ఆ డబ్బు అయితే, రానివ్వండి. తర్వాత చూద్దాం' అని బదులిస్తున్నా. కానీ, ఒక మంచి ప్రదేశంలో సొంత ఇంట్లో ఉండాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ డబ్బుతో రాజ్‌కోట్‌లో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా'అని ఈ యువ క్రికెటర్‌ తన కోరికను వెల్లడించాడు.

Story first published: Monday, April 12, 2021, 23:30 [IST]
Other articles published on Apr 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X