న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి మహిళా మ్యాచ్ రిఫరీ: ఎవరీ ఆరతి వైద్య

Meet Arati Vaidya – The first woman match referee in India

హైదరాబాద్: భారత దేశీవాళీ క్రికెట్ చరిత్రలోనే తొలి సారి మ్యాచ్ రిఫరీగా ఓ మహిళ ఎంపికైంది. భారత మహిళా క్రికెట్ మాజీ ప్లేయర్ ఆరతి వైద్య ఇలా ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేశారు. ముంబై వేదికగా జరుగుతున్న ముంబై టీ 20లీగ్‌లో ఈ రికార్డు చోటు చేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నమో బాంద్రా బ్లాస్టర్స్, సొబో సూపర్ సోనిక్స్ లకు మధ్య జరిగిన మ్యాచ్‌కు ఈమె తొలిసారి మ్యాచ్ రిఫరీగా విధులు నిర్వహించారు.

1995 సంవత్సరం నుంచి 1999వరకు భారత మహిళా క్రికెట్‌లో ఆడారు. ఆరతి తన కెరీర్‌లో 3 టెస్టులు, 6 వన్డేలలో ఆడారు. కొన్నాళ్లు ముంబై అండర్ 19 క్రికెట్ జట్టుకు సెలక్టరుగా విధులు నిర్వహించారు. తర్వాత కొన్నాళ్ల పాటు బీసీసీఐ నిర్వహించిన మహిళా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు, పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.

ఆనందోత్సాహంలో ఆరతి వైద్య:
తనకు ఈ అవకాశం వచ్చినందుకు గాను ఆమె ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మ్యాచ్ జరిగే ముందు చాలా ఉద్వేగానికి గురైయ్యాయని ఆమె తెలిపారు. 47 ఏళ్ల ఆరతి వైద్య మాట్లాడుతూ.. 'మ్యాచ్ రిఫరీగా ఉండటం, క్రికెట్ ఆడటం రెండూ విభిన్న రీతులతో కూడిన పనులు. ఒకసారి మ్యాచ్ రిఫరీగా ఉండటమంటే పూర్తిగా క్రికెట్‌ను చూసే కోణమే మారిపోతోంది. అలాంటిది ఓ మహిళ పురుషుల జట్టుకు మ్యాచ్ రిఫరీ చేయడమంటే ఇది సైకాలజికల్‌గా ఆలోచించాల్సిన విషయం' అని పేర్కొన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. 'ఇలా రిఫరీ జాబ్ చేయడమంటే ఛాలెంజింగ్‌తో కూడుకున్న పని. మేము ఆడేటప్పుడునియమాలు, హద్దులు గురించి ఆలోచించే వాళ్లం కాదు. కానీ, ఇప్పుడు రిఫరీగా ఉన్నప్పుడు ఓ ప్లేయర్‌ కోణానికి భిన్నంగా మ్యాచ్ పర్యవేక్షిస్తున్నా' అని ఆమె తెలిపారు.

Story first published: Friday, March 16, 2018, 14:58 [IST]
Other articles published on Mar 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X