న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రబడ అసంతృప్తి: మీడియా కొంతమంది ఆటగాళ్లను మాత్రమే హైప్‌ చేస్తోంది

Media hypes certain players: Kagiso Rabada unfazed by rise of Jasprit Bumrah, Jofra Archer

ముంబై: మీడియా కొంతమంది క్రికెటర్లను మాత్రమే హైప్‌ చేస్తుందని దక్షిణాఫ్రికా స్టార్ పేసర్‌ కగిసో రబడ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక కొంతమంది పట్ల నిర్లక్ష్యపు ధోరణిని ప్రదర్శిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇటీవల కాలంలో ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌, భారత్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాలను మీడియా ఆకాశానికి ఎత్తేస్తుందని తన అక్కసును వెళ్లగక్కాడు.

<strong>అమితాబ్‌కు సీఓఏ షోకాజ్‌ నోటీసులు!!</strong>అమితాబ్‌కు సీఓఏ షోకాజ్‌ నోటీసులు!!

ప్రశంసల వర్షం:

ప్రశంసల వర్షం:

వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా భారత్‌ను గెలిపించగా.. ఆస్ట్రేలియాతో హెడింగ్లీలో జరిగిన యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ సమం చేయడంలో ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ ఇద్దరిపై పలువురు మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు మీడియా ఆకాశానికి ఎత్తుకుంది. దీంతో అసంతృప్తి చెందిన రబడ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడడానికి దక్షిణాఫ్రికా ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిందే.

బుమ్రా బంతితో అద్భుతాలు చేస్తున్నాడు:

బుమ్రా బంతితో అద్భుతాలు చేస్తున్నాడు:

తాజాగా రబడ మాట్లాడుతూ... 'ఆర్చర్‌, బుమ్రాలను మంచి బౌలర్లు. నేను కచ్చితంగా వారిని అభినందిస్తా. ఇద్దరు తక్కువ కాలంలోనే అద్భుత ప్రదర్శన చేసి జట్టులో రెగ్యులర్‌ ఆటగాళ్లగా మారారు. తమ ప్రదర్శనతో ప్రత్యేక స్థానం కూడా సంపాదించుకున్నారు. ఆర్చర్‌ సహజసిద్ధమైన బౌలర్. బుమ్రా బంతితో అద్భుతాలు చేస్తున్నాడు. ఇద్దరు ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందిస్తున్నారు' అని పేర్కొన్నాడు.

మీడియాపై ఆగ్రహం :

మీడియాపై ఆగ్రహం :

'కేవలం ఆర్చర్‌, బుమ్రాలు మాత్రమే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం లేదు. నేను కూడా చాలా కాలంగా మంచి ప్రదర్శన చేస్తున్నా. ఈ విషయం అందరికి తెలుసు. ఎప్పుడూ ఆ ఇద్దరే టాప్‌లో ఉండరని కచ్చితంగా చెప్పగలను. కొంతమంది క్రికెటర్లను మాత్రమే మీడియా హైప్‌ చేస్తుంది. పలువురి క్రికెటర్లకు మీడియాలో లభించిన క్రేజ్‌ను చూస్తే తనను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భారత దేశానికి తిరిగి రావడం సంతోషంగా ఉంది. క్రికెట్ ఆడటానికి ఎదురుచూస్తున్నా' అని రబడ తెలిపాడు.

ఆసీస్‌దే యాషెస్‌.. నాలుగో టెస్టులో పోరాడి ఓడిన ఇంగ్లండ్‌!!

రెండో స్థానంలో రబడ:

రెండో స్థానంలో రబడ:

ఇటీవల విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆసీస్ పేసర్ పాట్ కమ్మిన్స్ అగ్ర స్థానంలో ఉండగా.. రబడ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బుమ్రా మూడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో 13 వికెట్లను తీయడంతో తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకున్నాడు. దక్షిణాఫ్రికా టీ20, టెస్ట్ జట్టులో రబడకు చోటు దక్కిన విషయం తెలిసిందే.

Story first published: Monday, September 9, 2019, 12:13 [IST]
Other articles published on Sep 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X