న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మనీష్ పాండేకు అవకాశలిస్తే స్టార్ ప్లేయర్ అయ్యేవాడు!

Manish Pandey’s childhood coach says give him fair chance, he can be India’s next big star
Manish Pandey, India’s Next Big Star - Irfan Sait | Oneindia Telugu

బెంగళూరు: టీమిండియా ప్లేయర్ మనీష్ పాండేకు తగినన్ని అవకాశాలు ఇచ్చుంటే ఈపాటికే స్టార్ ప్లేయర్ అయ్యేవాడని అతని చిన్ననాటి కోచ్ ఇర్ఫాన్ సెయిత్ అన్నాడు. ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల కన్నా బెంచ్‌పై కూర్చున్న మ్యాచ్‌లే ఎక్కువన్నాడు. ఇప్పటికైనా అతనికి అవకాశాలు ఇవ్వాలని కోరాడు. నిజాయతీగా ఇవ్వాల్సినన్ని అవకాశాలిస్తే గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక 2015లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మనీష్ పాండే.. జట్టులో చోటును సుస్థిరం చేసుకోలేకపోయాడు. తాజాగా శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో ఈ కర్ణాటక బ్యాట్స్‌న్ చోటు దక్కించుకున్నాడు.

అవకాశాలిస్తే సత్తా చాటుతాడు..

అవకాశాలిస్తే సత్తా చాటుతాడు..

ఈ క్రమంలో అతని చిన్ననాటి కోచ్ అయిన ఇర్ఫాన్ సెయిత్ ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మనీష్ పాండే పరిణతి చెందిన ఆటగాడని, సవ్వాళ్లను ఆస్వాదిస్తాడని తెలిపాడు. 'మనీష్ పాండే గట్టి పోటీదారుడు. అతను సవాళ్లను ఇష్టపడతాడు. ఎన్ని ఎక్కువ సవాళ్లుంటే అతడంత తెలివిగా, మెరుగ్గా ఆడతాడు. అతనికి తగినన్ని అవకాశాలు ఇచ్చుంటే.. ఈపాటికే అతను స్టార్ ప్లేయర్ అయ్యేవాడు. ఇప్పటికైనా అతనికి అవకాశలిస్తే తనలోని ప్రతిభను ప్రదర్శించగలడు. అతను రాణిస్తాడన్న నమ్మకం నాకుంది.

ఆడిన మ్యాచ్‌ల కంటే..

ఆడిన మ్యాచ్‌ల కంటే..

ముందు మనం మనీష్ పాండే పట్ల సానుకూలంగా ఉండాలి. అతను ఆడిన మ్యాచుల కన్నా రిజర్వు బెంచీపై కూర్చున్న మ్యాచ్‌లే ఎక్కువ. ఏదో ఒక స్థానంలో కచ్చితంగా ఆడే అవకాశం ఇవ్వలేదు. అతనికి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇచ్చి ఉంటే టీమింయాలో గొప్ప ఆటగాడిగా ఎదిగేవాడు. అతన్ని కొన్నిసార్లు దురదృష్టం కూడా వెంటాడింది. ఎందుకంటే పరుగులు చేసేందుకు అతనెప్పుడూ సరైన బ్యాటింగ్‌ ఆర్డర్‌లో రాలేదు. పూర్తి సిరీసుకు అవకాశమిస్తే అతనేంటో నిరూపించుకుంటాడు. అతను బ్యాటింగ్‌ మాత్రమే కాదు గొప్పగా ఫీల్డింగ్‌ చేయగలడు' అని సెయిత్‌ చెప్పుకొచ్చాడు.

సూపర్ సెంచరీలతో..

సూపర్ సెంచరీలతో..

కెరీర్ ఆరంభంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మనీష్ పాండే ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా అవతారమెత్తాడు. ఐపీఎల్ 2009లో డెక్కన్ చార్జర్స్ తరఫున పాండే( 73 బంతుల్లో 114) చేసిన సెంచరీ, 2016లో ఆస్ట్రేలియాపై 81 బంతుల్లో చేసిన శతకం కూడా క్లిష్టపరిస్థితిల్లో చేసిందే. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చి పాండే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కానీ అతను వరుసగా అవకాశాలు అందుకోలేకపోయాడు. 2015 నుంచి మొత్తం 10 వన్డే సిరీస్‌లు ఆడిన మనీష్ పాండే.. కేవలం రెండింటిలో మాత్రమే అన్ని మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఎప్పుడూ ఓకే స్థానంలో బ్యాటింగ్ చేయలేదు. నాలుగు, ఐదు, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. అయినా 21 ఇన్నింగ్స్‌ల్లో 492 రన్స్ చేశాడు. టీ20ల్లో 33 ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ 709 రన్స్ చేశాడు.

Story first published: Friday, June 11, 2021, 19:45 [IST]
Other articles published on Jun 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X