న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LSG vs CSK:కొంపముంచి శివమ్ దూబే... లక్నో చేతిలో చెన్నై చిత్తు!

 LSG vs CSK: Lucknow beat Chennai by six wickets with help of Evin Lewis unbeaten fifty

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ) బోణీ కొట్టింది. మరో నయా టీమ్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎదురైన తొలి పరాజయం నుంచి తేరుకున్న రాహుల్ సేన.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌‌పై అద్భుత విజయం సాధించింది. సెన్సేషనల్ బ్యాటింగ్‌తో 211 పరుగుల లక్ష్యాన్ని మరో 3 బంతులు ఉండగానే చేధించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీఎస్‌కే ఆల్‌రౌండర్ శివమ్ దూబే వేసిన 19వ ఓవర్ ఆ జట్టు కొంపముంచింది. ఆ ఓవర్‌లో అతను 25 పరుగులు సమర్పించుకోవడంతో లక్నో విజయం లాంఛనమైంది. ఈ దూబేకు బంతినిస్తూ చెన్నై చేసిన వ్యూహాత్మక తప్పిదం ఆ జట్టు పరాజయానికి కారణమైంది.

 చెలరేగిన ఎవిన్ లూయిస్

చెలరేగిన ఎవిన్ లూయిస్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప(27 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 50), శివమ్ దూబే(30 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్‌లతో 49), మొయిన్ అలీ(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), అంబటి రాయుడు(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) రాణించారు. లక్నో బౌలర్లలో ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అనంతర లక్ష్య చేధనకు దిగిన లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్(23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55 నాటౌట్), క్వింటన్ డికాక్(45 బంతుల్లో 9 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. చెన్నై బౌలర్లలో ప్రిటోరియస్ రెండు వికెట్లు తీయగా.. తుషార్, డ్వేన్ బ్రావో తలో వికెట్ పడగొట్టారు.

 99 పరుగుల శుభారంభం..

99 పరుగుల శుభారంభం..

211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ శుభారంభం అందించారు. దేశ్ పాండే వేసిన రెండో ఓవర్‌లో డికాక్ బౌండరీ బాదగా.. ముఖేష్ చౌదరి మరుసటి ఓవర్‌లో రాహుల్ సిక్సర్‌తో పాటు బౌండరీ బాదాడు. ఆ తర్వాత డికాక్ మూడు బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో లక్నో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ పోటాపోడీ సిక్స్‌లు, ఫోర్లు బాదగా.. స్కోర్ బోర్డు పరుగెత్తింది. బ్రావో బౌలింగ్‌లో సింగిల్ తీసి డికాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేయగా.. ప్రిటోరియస్ బౌలింగ్‌లో రాహుల్(40) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

బదోనీ సూపర్ ఫినిష్..

బదోనీ సూపర్ ఫినిష్..

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే(5) ఔటైనా.. ఎవిన్ లూయిస్ దంచికొట్టాడు. డికాక్ ఔటైనా.. లక్నో స్కోర్ బోర్డు వేగం తగ్గలేదు. దీపక్ హుడా.. ఓ సిక్స్, ఫోర్ బాది ఔటైనా.. యువ ప్లేయర్ ఆయూష్ బదోనీతో కలిసి లూయిస్ చెలరేగాడు. శివమ్ దూబే వేసిన 19వ ఓవర్ తొలి బంతిని బదోని స్వీప్ షాట్‌తో సిక్సర్‌ బాదగా.. లూయిస్ 4, 4, 6 హ్యాట్రిక్ బౌండరీలతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు లక్నో విజయసమీకరణం తగ్గించాడు. చివరి ఓవర్‌లో లక్నో విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరమవ్వగా.. బదోని మరో భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

Story first published: Friday, April 1, 2022, 0:03 [IST]
Other articles published on Apr 1, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X