న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గేలి చేసిన అభిమానులు: స్మిత్‌కు క్షమాపణ చెప్పిన కోహ్లీ (వీడియో)

ICC Cricket World Cup 2019 : Virat Kohli Asks Crowd To Stop Cheater Chants Directed At Steve Smith
London Diaries: Indian fans boo Smith, Kohli urges calm

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భారత అభిమానుల తరఫున ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు క్షమాపణలు చెప్పాడు. ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ అభిమానులు స్టీవ్ స్మిత్‌‌ను కించపరిచేలా వ్యాఖ్యానించారు. భారత ఇన్నింగ్స్ సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న స్మిత్‌ను ట్యాంపరింగ్‌ వివాదాన్ని ప్రస్తావిస్తూ 'చీటర్‌, చీటర్‌' అంటూ గేలి చేశారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అదే సమయంలో క్రీజులో బ్యాటింగ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ దీనిని గమించి హార్ధిక్‌ పాండ్యా ఔటైన తర్వాత ప్రేక్షకులను ఉద్దేశిస్తూ అలా ప్రవర్తించవద్దంటూ కోరాడు. స్టీవ్ స్మిత్‌‌ను చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేస్తూ తన క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐసీసీ తన ట్విట్టర్‌లో పేర్కొంది.

36 పరుగుల తేడాతో భారత్ విజయం

మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 353 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 316 పరుగులకే పరిమితమైంది. ఈ మెగా టోర్నీలో టీమిండియాకు ఇది రెండో విజయం. లక్ష్య చేధనలో ఓపెనర్లు ధాటిగా ఆడినా మిడిలార్డర్ మాత్రం భారత బౌలర్ల దెబ్బకి కుప్పకూలింది.

భారత బౌలర్లు విజృంభణ

భారత బౌలర్లు విజృంభణ

ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లలో స్మిత్‌ 70 బంతుల్లో 69(5 ఫోర్లు, సిక్స్), డేవిడ్ వార్నర్‌ 84బంతుల్లో 56(5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభణతో వరుసగా వికెట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. చివర్లో అలెక్స్ కారే 35బంతుల్లో 55(5 ఫోర్లు, సిక్స్)తో పోరాడినప్పటికీ జట్టుని గెలిపించలేకపోయాడు.

దేశం కోసం పోరాడుతున్నాడు

దేశం కోసం పోరాడుతున్నాడు

భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్, జస్ప్రీత్ బుమ్రా చెరో మూడు వికెట్లు తీయగా... యజువేంద్ర చాహల్‌ రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ అనంతరం భారత ప్రేక్షకుల తరఫున తానే స్వయంగా స్టీవ్‌ స్మిత్‌కు క్షమాపణలు చెప్తున్నానని కోహ్లీ అన్నాడు. కోహ్లీ మాట్లాడుతూ "జరిగిందేదో జరిగిపోయింది. అతను పునరాగమనం చేశాడు. వారి దేశం కోసం పోరాడుతున్నాడు" అని అన్నాడు.

స్మిత్‌ను ఇలా గేలి చేయడం చూశా

స్మిత్‌ను ఇలా గేలి చేయడం చూశా

"ఐపీఎల్‌లో కూడా స్మిత్‌ను ఇలా గేలి చేయడం చూశా. ఒకరిని కించపరస్తూ ఇలా గేలి చేయడం మంచింది కాదు. మా అభిమానుల తరఫున మైదానంలోనే అతన్ని క్షమాపణలు కోరాను. ఇది ఏమాత్రం అంగీకరించేది కాదు. గతంలో మా మధ్య వివాదాలు ఉండవచ్చు. మైదానంలో ఇద్దరం వాదించుకోవచ్చు. కానీ అతని బాధ నుంచి వచ్చే ఆటను చూడాలనుకోవద్దు" అని కోహ్లీ తెలిపాడు.

ఓ చెత్త ఉదాహరణగా మిగిలిపోవద్దు

"ఇక్కడ చాలా మంది భారత ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా ఓ చెత్త ఉదాహరణగా మిగిలిపోవద్దు. నేను స్మిత్‌ స్థానంలో ఉండి ఉంటే నేను కూడా బాధపడేవాడిని. అతను తప్పు చేశాడు. ఆ తప్పును అంగీకరించి క్షమాపణలు కోరాడు. దానికి శిక్షను కూడా అనుభవించాడు. అయినప్పటికీ మళ్లీ గేలి చేస్తే సహించడం ఎవరికైనా కష్టమే" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

పట్టుదలతో ఆడి మ్యాచ్‌ గెలిచాం

ఇదిలా ఉంటే అభిమానులను కోహ్లీ మందలించడాన్ని చూసిన స్టీవ్ స్మిత్‌ అభినందన పూర్వకంగా అతడి భుజం తట్టాడు. ఇక, ఆస్ట్రేలియా విజయంపై స్పందించిన కోహ్లీ "ఇది సమిష్టి విజయం. స్వదేశంలో ఆసీస్‌తో సిరీస్‌ ఓడిపోయాం. దీంతో మేమేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని భావించాం. పట్టుదలతో ఆడి మ్యాచ్‌ గెలిచాం" అని కోహ్లీ చెప్పాడు.

Story first published: Monday, June 10, 2019, 11:46 [IST]
Other articles published on Jun 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X