న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్.. కోహ్లీని చూసి నేర్చుకో: గంగూలీ

“Learn from Virat Kohli,”- Sourav Ganguly suggests Rishabh Pant

హైదరాబాద్: అరంగ్రేట మ్యాచ్ నుంచి తనలోని వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు యువ ఆటగాడు రిషబ్ పంత్. ఇంగ్లాండ్ పర్యటన నుంచి టీమిండియాలో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్‌ తన ప్రతి ఇన్నింగ్స్‌లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన తొలి టీ20లో మాత్రం అనసవర షాట్ ఆడడంతో అవుట్ అయి పెవిలియన్ చేరుకున్నాడు. ఈ క్రమంలో పంత్‌ ఆటను ఎలా సులభంగా ఆడాలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని చూసి నేర్చుకోవాలని భారత మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ సూచించాడు.

 అనవసరపు షాట్‌కు యత్నించి ఔట్‌ కావడంతో

అనవసరపు షాట్‌కు యత్నించి ఔట్‌ కావడంతో

బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్‌ నాలుగు పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. క్రీజులో రిషబ్‌ ఉన్నంత వరకు విజయం దాదాపు భారత్‌ వైపే ఉంది. కానీ చివర్లో అనుభవలేమితో ఒత్తిడికి గురై అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఔట్‌ కావడంతో మ్యాచ్‌ చేజారింది. ఈ కారణంగానే తొలి టీ20లో ఆస్ట్రేలియా అదృష్టవశాత్తు విజయం సాధించిందని గంగూలీ అన్నాడు.

ఆటను సులభంగా ఆడే విషయంలో మాత్రం

ఆటను సులభంగా ఆడే విషయంలో మాత్రం

‘సామర్థ్య పరంగా చూసుకుంటే రిషబ్‌లో ఎంతో ప్రతిభ దాగి ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు పరుగులు రాబట్టగలడు. కానీ ఆటను సులభంగా ఆడే విషయంలో మాత్రం రిషబ్‌ మెరుగుపడాలి. ఇలాంటి విషయాల్లో అతను కెప్టెన్‌ కోహ్లీని చూసి నేర్చుకోవాలి. అతని నుంచి చాలా తెలుసుకోవచ్చు.' అని ఈ మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు. మరోవైపు ప్రస్తుత టీ20 షెడ్యూల్‌పైనా గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

 5 రోజుల వ్యవధిలోనే 3 టీ20లు సరైంది కాదు

5 రోజుల వ్యవధిలోనే 3 టీ20లు సరైంది కాదు

కేవలం 5 రోజుల వ్యవధిలోనే 3 టీ20లు నిర్వహించడం సరైన నిర్ణయం కాదు. మూడో మ్యాచ్‌ కోసం సిడ్నీ చేరుకోవాలి. తొలి రెండు పిచ్‌లతో పోల్చుకుంటే సిడ్నీ పిచ్‌ నుంచి ఆటగాళ్లు భిన్న సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. తొలి టీ20లో భారత్‌.. ఆసీస్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరంభంలోనే బ్యాట్స్‌మెన్‌ను కట్డడి చేయడంతోపాటు అక్కడి పరిస్థితులపై కూడా భారత బౌలర్లు విజయం సాధించారు. దీంతో మూడో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఒత్తిడితో బరిలోకి దిగాల్సి వస్తుంది.

మూడో టీ20 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా

మూడో టీ20 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా

చివరి టీ20లోనే కాకుండా టెస్టు, వన్డే సిరీస్‌ల్లోనూ భారత్‌దే విజయమని ఈ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ఇక రెండో టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో నిర్ణయాత్మకమైన మూడో టీ20 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనుంది.

Story first published: Sunday, November 25, 2018, 13:17 [IST]
Other articles published on Nov 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X