న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని అలా వదిలేయకండి ఎవరైనా చెప్పండి: సెహ్వాగ్

Kohli needs someone to point out his mistakes: Sehwag

హైదరాబాద్: విమర్శకులు ఉన్నప్పుడే వీరత్వం బయటికి వస్తుంది. ఇదే కోవలో సెహ్వాగ్ కోహ్లీ గురించి పలు సూచనలు చేస్తున్నాడు. జట్టు ఎంపికపై, అతని ప్రవర్తనపై తోటి ఆటగాళ్లు కానీ, అతనితో సన్నిహితంగా ఉండే వాళ్లు కానీ ఎటువంటి జాగ్రత్తలు చెప్పకపోవడంపై సెహ్వాగ్ జాగ్రత్తను గుర్తు చేస్తున్నాడు.

టీమిండియా కెప్టెన్ కోహ్లి నిర్ణయాలను జట్టులో ఎవరూ సవాల్‌ చేయకపోవడాన్ని భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తప్పుపట్టాడు. పిచ్‌లో కెప్టెన్ చేసే తప్పులను సహచరులు ఎత్తి చూపాలని గుర్తు చేశాడు.

''తాను చేసే తప్పులను వెతికే ఆటగాళ్లు ఇప్పుడు విరాట్‌ కోహ్లికి కావాలి. ప్రతి జట్టులోనూ ఇలాంటి ఆటగాళ్లు నలుగురైదుగురు ఉంటారు. నాయకుడు తప్పు చేయకుండా వీరు చూస్తారు. భారత జట్టులో మాత్రం అలాంటి ఆటగాళ్లు లేరు. కోహ్లి సెలక్షన్‌ నిర్ణయాలను ఎవరూ డ్రెస్సింగ్‌ రూమ్‌లో సవాల్‌ చేయడం లేదు'' అని సెహ్వాగ్‌ అన్నాడు.

సహచర ఆటగాళ్లపై విపరీత అంచనాలు కూడా కోహ్లి కెప్టెన్సీపై ప్రభావం చూపిస్తున్నాయని వీరూ అన్నాడు. ''క్లిష్టపరిస్థితుల్లో కూడా అద్భుతంగా ఆడే స్థాయికి విరాట్‌ చేరుకున్నాడు. జట్టులో ఇతర ఆటగాళ్లు ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. ఇది కోహ్లి నాయకత్వంపై ప్రభావం చూపిస్తోంది. తనలానే ఇతర ఆటగాళ్లు కూడా ధైర్యంగా ఆడాలని కోరుకుంటాడు.' అని ఆయన స్పష్టం చేశాడు.

'అలా అనుకోవడంలో ఎలాంటి తప్పులేదు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ కూడా తాను నాయకుడిగా ఉన్నప్పుడు ఇలానే అనుకునేవాడు. తాను ఆడుతున్నప్పుడు మిగతావారు ఎందుకు ఆడడం లేదని ప్రశ్నించేవాడు. ఏ ఒక్క ఆటగాడి వల్ల విజయం రాదు. సమష్టి కృషితోనే ఏదైనా సాధించగలం. ప్రతి ఒక్క ఆటగాడు తన వంతు పాత్ర పోషించాలి'' అని సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు.

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ కోహ్లీ కెప్టెన్సీపై నాకు నమ్మకం లేదు. సుదీర్ఘ కాలం నాయకుడిగా కొనసాగలేడేమోనన్న సందేహం వ్యక్తం చేస్తూ మంగళవారం వ్యాఖ్యలు చేశాడు. ఇంకా అతను మాట్లాడుతూ భారత జట్టులో కోహ్లీకి ఎవరైనా మంచి చెడులు చెప్పి నడిపించే వాళ్లు ఉండాలంటూ హితవు పలికాడు. ఇప్పుడు అతనిని సమర్థిస్తూ సెహ్వాగ్ కూడా అవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 24, 2018, 10:23 [IST]
Other articles published on Jan 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X