Virat Kohli : డగౌట్ నుంచి రాహుల్, రోహిత్ సైగలతో ఆ మ్యాటర్ చెప్పారు.. సూర్య బ్యాటింగ్ చూసి స్టన్నయ్యా..!

ఆద్యంతం సీటు ఎడ్జ్‌ల మీద కూర్చోబెట్టేలా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్లోని డిసైడర్ అయిన మూడో టీ20 మ్యాచ్ సాగింది. చివరి ఓవర్లో గెలుపునకు 11పరుగులు కావాల్సిన తరుణంలో మరో బంతి మిగిలి ఉండగానే.. భారత్ గెలుపు గీతను దాటింది. కోహ్లీ తొలి బంతికి సిక్స్ కొట్టడంతో సమీకరణం 5బంతుల్లో 5పరుగులకు చేరుకుంది. అయితే 2వ బంతికి క్యాచ్ ఔట్ కావడంతో మరోసారి ఉత్కంఠ తీవ్రమైంది. అయితే హార్దిక్ 2బంతుల్లో 4పరుగులు కావాల్సిన తరుణంలో అల్ట్రా బ్యాక్ సైడ్ ఫోర్ కొట్టడంతో స్టేడియంలో సంబరాలు మిన్నంటాయి. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీ తన ఛేజింగ్ స్పెషలిటీని చూపించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడు. క్లాసిక్ బౌండరీ, మాస్టర్ క్లాస్ సిక్సులతో కోహ్లీ అలరించిన విధానానికి స్టేడియం హోరెత్తింది. ఇక మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. చాలా ఆసక్తికర విషయాలు చెప్పాడు.

సూర్య గురించి చెప్పాలంటే మాటలు చాలవు

అందుకే నేను నంబర్ 3 వద్ద బ్యాటింగ్ చేయడం ఇంపార్టెంట్. జట్టుకు ఆ స్థానంలో నా అనుభవం ఉపయుక్తంగా ఉంటుంది. మ్యాచ్ టైంలో డగ్ అవుట్ వైపు ఓసారి తిరిగినప్పుడు.. రాహుల్ భాయ్, రోహిత్ నాకు సైగలు చేశారు. ఇద్దరూ నన్ను చివరి వరకు బ్యాటింగ్ కొనసాగించాలని సూచించారు. నేను ఆ విషయంలో సఫలమయ్యా. ఇక సూర్య గురించి చెప్పాలంటే.. మాటలు చాలవు. సూర్య చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను ఏ పరిస్థితిలోనైనా బ్యాటింగ్ చేయగలడు. అతను ఆసియా కప్‌లో ఎలాంటి ప్రదర్శన చేశాడో చూశాం. అతను బంతిని బలంగా స్ట్రైక్ చేయగలడు. గత 6నెలలుగా నేను అతని ఇన్నింగ్స్ చూస్తూనే ఉన్నాను. అందులో అత్యుత్తమ ప్రదర్శన ఇది. అతనికి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ టైమింగ్. వాటే టైమింగ్ అసలు. అవతలి ఎండ్‌లో ఉండి అతను ఆడుతున్న షాట్లను చూసి స్టన్ అయిపోయాను.

విరామం, ఫిట్ నెస్, ప్రాక్టీస్ వల్లే మళ్లీ ఇలా..

ఇక స్పిన్నర్ ఆడమ్ జంపా.. నా స్కోరింగ్ రేట్‌ను నియంత్రించడానికి చాలా ప్రయత్నించాడు. నేను అందుకే కాస్త లెగ్ సైడ్ జరిగి ఆఫ్-సైడ్ షాట్లు ఆడడానికి ప్రయత్నించాను. ఇక చివర్లో సిక్స్ తర్వాత సింగిల్ తీసినందుకు నేను కొంత నిరాశకు గురయ్యాను. ఇకపోతే 20వ ఓవర్‌లోని మొదటి బంతికి సిక్స్ గురించి మాట్లాడుతూ.. నా ఉద్దేశం ప్రకారం.. ఆఖరి ఓవర్‌లో 4-5 పరుగులుగా మా రిక్వైడ్ రన్స్ ఉంచాలనుకున్నాం. కానీ అది జరగకపోయే సరికి కొంచెం డిస్సాప్పాయింట్ అయ్యాను. అయితే.. తొలి బంతికి బౌండరీ చాలా ముఖ్యమని భావించి హిట్ చేశా. ఆ సిక్సర్ జట్టుకు చాలా ఉపయుక్తమయింది. జట్టుకు నేను అందించిన నా సహకారం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. నేను కొంత విరామం తీసుకున్నాను. విరామం అనంతరం ప్రాక్టీస్ కోసం నెట్స్‌‌లోకి వచ్చాను. నా ఫిట్‌నెస్‌పై కష్టపడి పనిచేశాను. వీటన్నింటి ఫలితం ప్రస్తుతం వస్తుంది. నేను నా జట్టు కోసం నా వంతు సహకారం ఇలాగే అందించాలని కోరుకుంటున్నాను.

 ఛేజింగ్లో రారాజు

ఛేజింగ్లో రారాజు

నంబర్ 3 పొజిషన్లో కోహ్లీ ఎంతటి విలువైన ప్లేయర్ ఈ మ్యాచ్ ద్వారా మరోసారి చూపించాడు. ఛేజింగ్లో రారాజుగా పేరొందిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో దానికి నిలువుటద్దంలా నిలిచే ఇన్నింగ్స్ ఆడాడు. అవసరమైనంత సేపు క్రీజులో ఉండి.. ఇన్నింగ్స్ రిక్వయిడ్ రన్ రేట్ పడిపోకుండా ఓ పద్ధతి ప్రకారం కోహ్లీ ఛేజింగ్ మంత్ర సాగింది. తొలుత రోహిత్, తర్వాత సూర్య, ఆ తర్వాత హార్దిక్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన కోహ్లీ.. దాదాపు మ్యాచ్ గెలుపు అంచులవరకు క్రీజులోనే ఉన్నాడు. కోహ్లీ 63పరుగుల ఇన్నింగ్స్.. జట్టు విజయానికి వెన్నెముకలా నిలిచింది. ఎనర్జిటిక్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కూడా కోహ్లీని వరించింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 26, 2022, 9:07 [IST]
Other articles published on Sep 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X