న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ నా కోసం మరాఠీలో మాట్లాడాడు: పృథ్వీ షా

Kohli bhai tried to speak in Marathi with me, made me feel comfortable: Prithvi Shaw

రాజ్‌కోట్: 18 ఏళ్ల వయసుకే భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకుని అరంగేట్ర మ్యాచ్‌కు సిద్ధమైపోతున్నాడు ముంబయి యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా. ఐతే తొలి టెస్టు ఆడబోతున్న పృథ్వీ ఒత్తిడిలో ఉంటాడేమో అని.. అతడిని తేలికపరిచేందుకు నెట్స్‌ సందర్భంగా మరాఠీలో మాట్లాడే ప్రయత్నం చేశాడట కెప్టెన్‌ కోహ్లి. ఈ విషయాన్ని పృథ్వీనే వెల్లడించాడు.

మైదానంలో అంతకంటే కఠినంగా ఉంటాడని

మైదానంలో అంతకంటే కఠినంగా ఉంటాడని

‘కోహ్లి బయట ఎంత సరదాగా ఉంటాడో.. మైదానంలో అంతకంటే కఠినంగా ఉంటాడని అందరికీ తెలుసు. కానీ నాతో మాట్లాడేటపుడు విరాట్‌ జోకులు పేల్చాడు. అలాగే నాతో మరాఠీలో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అది సరదాగా అనిపించింది' అని అతనన్నాడు.

కొంచెం ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నా

కొంచెం ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నా

ఇక తొలి టెస్టు ఆడబోతున్న అనుభవం గురించి పృథ్వీ స్పందిస్తూ.. ‘చాలా సంతోషంగా ఉంది. గర్వంగా అనిపిస్తోంది. అలాగే కొంచెం ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నా. ఐతే డ్రెస్సింగ్‌ రూంలో సీనియర్‌, జూనియర్‌ అన్న తేడా ఏమీ ఉండదని కోహ్లి, రవిశాస్త్రి చెప్పారు. నాకు అక్కడ చాలా సౌకర్యంగా అనిపించింది. అందుక్కారణం కోహ్లినే. నేను రంజీ ట్రోఫీలో ఎలా ఆడతానో అలాగే ఇక్కడా ఆడమని రవిశాస్త్రి సలహా ఇచ్చాడు' అని చెప్పాడు.

టెస్టు క్యాప్ అందుకోవడం సంతోషంగా

ఇంత చిన్న వయస్సులో డ్రెస్సింగ్ రూమ్‌లో నన్ను చూడటం అందరికీ ఆనందంగా అనిపించింది. ఈ క్రమంలోనే తొలి రోజు ప్రాక్టీస్ సెషన్‌ను చక్కగా ముగించాం. నాకు చాలా గర్వంగా గొప్పగా అనిపించింది. విరాట్ కోహ్లీ నన్ను కంఫర్టబుల్‌గా ఉండేందుకు సాయం చేశాడు. నెట్స్‌లో ఆడేందుకు ఖాళీ మైండ్‌తో బరిలోకి దిగుతా. బంతిని బట్టి స్పందిస్తా. కోచ్ రవిశాస్త్రి.. రంజీ ట్రోఫీల్లో ఎలాగైతే ఆడానో అలానే ఆడమని చెప్పారు. టెస్టు క్యాప్ అందుకోవడం చాలా సంతోషంగా అనిపించింది'

ధావన్.. రాహుల్‌లను ఓపెనర్లుగా భావించి

ధావన్.. రాహుల్‌లను ఓపెనర్లుగా భావించి

ముంబై యువ క్రికెటర్ పృథ్వీ షా అరంగ్రేటంతో టీమిండియా నిర్ణయం మార్చుకుంది. ముందుగా శిఖర్ ధావన్.. కేఎల్ రాహుల్‌లను ఓపెనర్లుగా భావించినా.. ఆ తర్వాత ధావన్ స్థానాన్ని పృథ్వీ షా భర్తీ చేశాడు. గతంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో టీమిండియాకు పృథ్వీ నిర్ణయం మార్చుకున్నాడు.

Story first published: Thursday, October 4, 2018, 10:06 [IST]
Other articles published on Oct 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X