హ్యాపీ బర్త్ డే పిచ్చి పిల్లా.. ప్రేయసికి కేఎల్ రాహుల్ విషెస్!

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్‌ నటి అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. డిన్నర్ డేట్, పబ్, పార్టీలు అంటూ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరగడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే వీరూ బాహటంగానే తిరిగినా.. తమ ప్రేమవ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.. అంగీకరించలేదు. అయితే గురువారం 28వ జన్మదినం జరపుకున్న అతియా శెట్టికి రాహుల్ తనదైన శైలిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.

పిచ్చి పిల్లా అంటూ..

పిచ్చి పిల్లా అంటూ..

ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ స్పెషల్ పోస్ట్‌ను ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ షేర్ చేశాడు. జన్మదిన శుభాకాంక్షలు పిచ్చి పిల్లా( హ్యాపీ బర్త్‌డే మ్యాడ్‌ చైల్డ్‌) అంటూ ఈ బాలీవుడ్ బ్యూటీతో చనువుగా ఉన్న ఓ ఫోటోను పంచుకున్నాడు. ఈ ఫొటోలో రాహుల్‌ భుజంపై అతియా తల ఆనించి సెల్ఫీకి ఫోజిచ్చినట్లుంది. దాంతో వీరి ప్రేమాయణం మరోసారి హాట్ టాపిక్ అయింది. వీరి మధ్యలో లవ్ లేకుంటే ఇంత రోమాన్స్ దేనికని అభిమానులు ప్రశిస్తున్నారు. వీరు లవర్సేనని కామెంట్ చేస్తున్నారు.

గతేడాది బర్త్‌డే సందర్భంగానే..

గతేడాది బర్త్‌డే సందర్భంగానే..

గ‌తేడాది అతియా శెట్టి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రాహుల్ ఆమెకు విషెస్ చెప్ప‌డంతో.. వీరిద్ద‌రి మధ్య ప్రేమ మొద‌లైంద‌ని అంతా అనుకున్నారు. ఆ వాద‌న‌ల‌కు బ‌లం చేకూరుస్తూ రాహుల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సునీల్ శెట్టి న‌టించిన 'హేరాపేరి' సినిమాలో అత్యంత పాపుల‌ర్ అయిన టెలిఫోన్ స‌న్నివేశాన్ని ఇమిటేట్ చేశాడు. రాహుల్ ఫోన్ మాట్లాడుతుండ‌గా.. అతియా ఫోన్ ప‌క్క‌న నిలుచొని కాయిన్ వేస్తుంది. అప్పుడు రాహుల్ ఫోన్‌లో 'హ‌లో దేవీ ప్ర‌సాద్' అంటాడు. అప్ప‌ట్లో ఈ పోస్ట్ బాగా వైర‌ల్ అయింది.

రాహుల్ నావాడంటూ..

రాహుల్ నావాడంటూ..

ఇటీవల రాహుల్​ పుట్టినరోజు సందర్భంగా అతియా శుభాకాంక్షలు తెలుపుతూ ‘అతను నా వ్యక్తి' అని సోషల్‌ మీడియాలో పేర్కొంది. 'హ్యాప్పీ బ‌ర్త్‌డే మై డియ‌ర్' అని కామెంటు పెట్టి ల‌వ్ ఎమోజీని అతియా శెట్టి యాడ్ చేసింది. అప్పట్లో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ ఫోటోపై కామెంట్లు పెట్టారు. సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహుజా, టైగర్ ష్రాఫ్ సోదరి తమదైన స్టయిల్లో కామెంట్ పెట్టారు. ఏడాదిగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్న రాహుల్‌, అతియాలు పెళ్లి చేసుకుంటే.. తమకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని సునీల్ శెట్టి దంప‌తులు ఇదివ‌ర‌కే పేర్కొన్నారు.

రాహుల్@ 670

రాహుల్@ 670

ఐపీఎల్ 2020 సీజన్‌లో సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగిన కేఎల్ రాహుల్.. తమ జట్టును మాత్రం ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. కానీ తనదైన సారథ్యంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను నడిపించి ఆకట్టుకున్నాడు. టోర్నీ ఆసాంతం టఫ్ ఫైట్ ఇచ్చిన పంజాబ్ అదృష్టం కలిసిరాక నిష్క్రమించింది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడి.. ఓడాల్సిన మ్యాచ్‌ల్లో గెలిచి అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ప్రతీమ్యాచ్ ఆఖరి బంతి వరకు తీసుకెళ్లింది. మూడు సూపర్ ఓవర్లు ఆడింది. ఈ సీజన్‌లో రాహుల్ 670 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.

IPL 2020: ముంబై ఫైనల్ చేరడం ఆరోసారి.. ప్రత్యర్థిగా ధోనీ లేకపోవడం ఇదే తొలిసారి!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, November 6, 2020, 12:39 [IST]
Other articles published on Nov 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X