న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇప్పటికీ ఆ ఓటమి పీడకలలా వెంటాడుతోంది : రాహుల్

KL Rahul Says World Cup semifinal loss to New Zealand still haunts us

ముంబై: గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ మెగా టోర్నీలో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన సెమీఫైనల్‌ పరాజయం తనను ఇంకా వెంటాడుతోందని భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ తెలిపాడు. ఈ ఓటమిని టీమిండియా ఎప్పటికీ మర్చిపోలేదని ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ చెప్పుకొచ్చాడు. 'మీ జీవితంలో కుదిరితే ఏ మ్యాచ్ ఫలితాన్ని మార్చాలనుకుంటున్నారు?' అని.. రాహుల్‌ను ఓ అభిమాని అడిగిన ప్రశ్నించగా.. ఏదైనా ఒక మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే శక్తి గనక తనకు లభిస్తే కచ్చితంగా వరల్డ్‌కప్‌ సెమీస్‌ మ్యాచ్‌ ఫలితాన్నే తిరగ రాస్తానని సమాధానమిచ్చాడు.

ఓటమి గుర్తొచ్చి ఉలిక్కిపడుతుంటా..

ఓటమి గుర్తొచ్చి ఉలిక్కిపడుతుంటా..

ఇప్పటికీ తనను, జట్టులోని కొందరు ఆటగాళ్లను ఆ ఓటమి ఓ పీడకలా వెంటాడుతోందని తెలిపాడు. ఒక్కోసారి ఈ పీడకలతో నిద్రలో తాను ఉలిక్కిపడతాన్నాడు. ‘టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడామని మాకు తెలుసు. అందుకే ఆ ఓటమిని అసలు జీర్ణం చేసుకోలేకపోతున్నాం' అని వెల్లడించాడు. శనివారం ‘ది మైండ్ బిహైండ్' షోలో చిట్ చాట్ చేసిన రాహుల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

నోట్స్ తయారు చేసుకుంటున్నా..

నోట్స్ తయారు చేసుకుంటున్నా..

కోవిడ్‌-19 కారణంగా అనూహ్యంగా లభించిన ఈ విరామ సమయాన్ని ఆస్వాదిస్తు న్నానని రాహుల్‌ చెప్పాడు. ‘లాక్‌డౌన్‌ను ప్రశాంతంగా గడుపుతున్నా. కాసేపు ఇంటిపనులు చేస్తున్నా. మరికాసేపు పాత ప్రదర్శనల వీడియోలు చూస్తూ నోట్స్‌ తయారు చేసుకుంటున్నా. వీటి ద్వారా నేను ఇంకా ఏ అంశాల్లో మెరుగవ్వాలో తెలుసుకుంటున్నా' అని రాహుల్‌ అన్నాడు.

బ్యాట్‌కు రూ.2.6 లక్షలు..

బ్యాట్‌కు రూ.2.6 లక్షలు..

దేశంలో వెనుకబడిన, దుర్భర జీవితం గడుపుతున్న చిన్నారులకు చేయూతనిచ్చేందుకు రాహుల్.. 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు టీ20, టెస్ట్ ఫార్మాట్ జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్‌ వేలం వేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఆక్షన్ ద్వారా లభించిన మొత్తాన్ని అవేర్ ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లల సంరక్షణకు ఖర్చుచేయనున్నారు.

అయితే ఈ వేలంలో రాహుల్ బ్యాట్ రూ.2.64,228 పలకగా.. హెల్మెట్ రూ.1,22.677, ప్యాడ్స్ రూ.33,028, వన్డే జెర్సీ రూ.1,13,240, టీ20 జెర్సీ రూ. 1,04,824, టెస్ట్ జెర్సీ రూ. 1,32,774, గ్లవ్స్ రూ.28,782కు అమ్ముడయ్యాయి. ఇక తన కిట్ ద్వారా రాహుల్ ఓవరాల్‌గా రూ.7.99 లక్షలు సమకూర్చాడు.

Story first published: Sunday, April 26, 2020, 9:10 [IST]
Other articles published on Apr 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X