న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్ మెరుగ్గా ఆడేందుకు యత్నిస్తున్నాడు: బంగర్

KL Rahul needs to take more responsibility: Sanjay Bangar

సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ఆడిన వార్మప్ మ్యాచ్‌లోనూ కేఎల్ రాహుల్ అవుటవడంతో అతనిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇలా రాహుల్‌‌పై విపరీతమైన విమర్శలు వచ్చిన నేపథ్యంలో అతనికి బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ మద్దతుగా నిలిచాడు. స్వీయ తప్పిదాలతో ఔట్‌ అవుతున్న రాహుల్‌ తన తప్పులను సరిదిద్దుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాడంటూ పేర్కొన్నాడు.

బంతిని శరీరంపైకి లాక్కొని తరచుగా

బంతిని శరీరంపైకి లాక్కొని తరచుగా

రాహుల్‌ గాడిలో పడతాడనే ఆశిస్తున్నా. మెరుగ్గా రాణించేందుకు సరికొత్త తరహాలో బ్యాటింగ్ చేసేందుకు యత్నిస్తున్నాడు. కానీ ఒక విషయంలో మాత్రం ఒకే తరహాలో బంతిని శరీరంపైకి లాక్కొని తరచుగా ఔటవుతున్నాడు. అతను ఆ విధానాన్ని మార్చుకునే పనిలో ఉన్నాడు. అతనేమీ యువ క్రికెటర్‌ కాదు.. ఒక సీనియర్‌ క్రికెటర్‌. ఆస్ట్రేలియా పర్యటనకు రెండోసారి వచ్చాడు.

ఇప‍్పటికే 30 టెస్టులు ఆడాడు. అతని నుంచి బాధ్యతాయుతమైన ఆటను మేం ఆశిస్తున్నాం. రాహుల్‌ కచ్చితంగా జట్టుకు ఉపయోగపడే బ్యాట్స్‌మన్‌. రాబోయే రోజుల్లో అతని మంచి ఇన్నింగ్స్‌ను చూస్తామనే నమ్మకముంది.

 పరుగుల మోత మోగించిన టాపార్డర్

పరుగుల మోత మోగించిన టాపార్డర్

గురువారం ఆరంభమైన వార్మప్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 92 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌటైంది. 4 రోజుల వార్మప్ మ్యాచ్‌‌లో వర్షం కారణంగా బుధవారం తొలిరోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో భారత్ టాపార్డర్ పరుగుల మోత మోగించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు బౌలింగ్‌ తీసుకుంది.

రాహుల్.. షా‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్

రాహుల్.. షా‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్

కోహ్లి సేన బ్యాటింగ్‌కు దిగింది. ఇటీవల ఆసీస్‌పై టీ20 సిరీస్‌లో ఘోరంగా విఫలమైన కేఎల్ రాహుల్.. పృథ్వీ షా‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ మ్యాచ్‌లోనూ రాహుల్ (3) మరోసారి నిరాశపరిచాడు. వార్మప్ మ్యాచ్ స్కోరును బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ వేదికగా అప్‌డేట్ చేసింది. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ 3 పరుగులకే అవుట్ అయ్యాడంటూ చేసిన ట్వీట్‌పై నెటిజన్లకు విరుచుకుపడ్డారు.

దయచేసి జట్టులోంచి తీసేయండి.

దయచేసి జట్టులోంచి తీసేయండి.

'అతను క్రికెటర్‌యే కాదు. అసలు జట్టులోకి ఎందుకు తీసుకున్నారు. 'దయచేసి జట్టులోంచి తీసేయండి. భవిష్యత్ సూపర్ స్టార్ పృథ్వీ షా.. కేఎల్ రాహుల్ కంటే మెరుగ్గా ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ ఔటవడంలో ఆశ్చర్యమేమి లేదు' అని అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

Story first published: Thursday, November 29, 2018, 17:09 [IST]
Other articles published on Nov 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X