న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈడెన్‌లో KKR vs SRH: వార్నర్ హాఫ్ సెంచరీ, నైట్‌రైడర్స్ టార్గెట్ 182

IPL 2019 : Warner,Shankar And Bairstow Power Hyderabad To 181/3 | Oneindia Telugu
KKR Vs SRH LIVE IPL Cricket Score Match 2 : David Warner, Vijay Shankar fire SRH to 181

హైదరాబాద్: ఐపీఎల్‌ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా డేవిడ్ వార్నర్ రీఎంట్రీ అదిరింది. టోర్నీలో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (85: 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఏడాది తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం

ఏడాది తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం

ఏడాది తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన వార్నర్ తొలి వికెట్‌కి జానీ బెయిర్‌స్టో (39: 35 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ (40 నాటౌట్: 24 బంతుల్లో 2 పోర్లు, 2 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సన్‌రైజర్స్... సొంతగడ్డపై కోల్‌కతాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

నిరాశపరిచిన యూసప్ ఫఠాన్

నిరాశపరిచిన యూసప్ ఫఠాన్

మరోవైపు సన్‌రైజర్స్ హిట్టర్ యూసఫ్ పఠాన్ (1: 4 బంతుల్లో) నిరాశపరచగా.. మనీశ్ పాండే (8 నాటౌట్) చివర్లో ఫరవాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఇటీవల టెస్టు మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో అతడి స్థానంలో భువనేశ్వర్‌కు పగ్గాలు అప్పజెప్పారు.

భువీ తొలిసారి కెప్టెన్‌గా

భువీ తొలిసారి కెప్టెన్‌గా

దాంతో ఐపీఎల్‌లో భువీ తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బాల్ టాంపరింగ్‌ ఉదంతంలో ఏడాది నిషేధం వేటు పడటంతో 2018 ఐపీఎల్ సీజన్‌కి దూరమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఈ మ్యాచ్‌తో మళ్లీ టోర్నీలోకి పునరాగమనం చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఈ రెండు జట్లూ 15సార్లు తలపడగా

ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లూ 15సార్లు తలపడగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏకంగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరింట విజయం సాధించింది. 2018 ఐపీఎల్‌ సీజన్‌‌లో మూడు సార్లు (లీగ్‌ దశలో రెండు సార్లు, ఎలిమినేటర్ మ్యాచ్) ఢీకొనగా.. లీగ్ తొలి మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్.. ఆ తర్వాత రెండో మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గ���లిచి ఫైనల్‌కి చేరింది.

1
45758
Story first published: Sunday, March 24, 2019, 18:15 [IST]
Other articles published on Mar 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X