న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR Intra Squad Practice Match 2022: వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం.. అయినా తప్పని ఓటమి!

KKR Intra Squad Practice Match 2022: Nithish Ranas Team Purple Beat Venkatesh Iyer Led Team Gold

ముంబై: మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ సమాయత్తం అవుతోంది. సన్నాహకాల్లో భాగంగా బుధవారం ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌ నిర్వహించింది. జట్టులో ఆటగాళ్లను టీమ్ పర్పుల్, టీమ్ గోల్డ్ పేరిట రెండు జట్లుగా విభజించి సన్నాహక మ్యాచ్ నిర్వహించగా.. నితీశ్ రాణాకు చెందిన టీమ్ పర్పుల్ 7 వికెట్ల తేడాతో వెంకటేశ్ అయ్యర్‌ ప్రాతినిథ్యం వహించిన టీమ్ గోల్డ్‌పై ఘన విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ గోల్డ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. వెంకటేశ్ అయ్యార్(47 బంతుల్లో 87) భారీ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఆమన్ ఖాన్(13 బంతుల్లో 27)అతనికి అండగా నిలిచాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమ్ పర్పుల్ 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 205 పరుగులు చేసింది. అభిజీత్ తోమర్(26 బంతుల్లో 52), నితీశ్ రాణా(29 బంతుల్లో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. రింకూ సింగ్(22 బంతుల్లో 48) రన్స్ విలువైన పరుగులు చేశాడు. ఈ సన్నాహక మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లు సత్తా చాటడం కేకేఆర్‌కు కలిసొచ్చే అంశం. శనివారం ప్రారంభమయ్యే లీగ్ ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో కేకేఆర్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి గత సీజన్ ఫైనల్లో ఎదురైన పరాభావానికి కేకేఆర్ బదులు తీర్చుకోవాలనుకుంటుంది.

గత సీజన్‌లో జట్టును ఫైనల్ చేర్చిన ఇయాన్ మోర్గాన్​ను​ వదులుకున్న కేకేఆర్​ వేలంలో రూ.12.25 కోట్ల ధరతో కొనుక్కున్న టీమిండియా స్టార్‌‌‌‌ శ్రేయస్ అయ్యర్​ను కెప్టెన్ గా నియమించింది. కొన్నేళ్లుగా కోల్‌కతాను ఇబ్బంది పెడుతున్న కెప్టెన్సీ సమస్య శ్రేయస్‌ వల్ల తీరిపోయినట్లే. బ్యాట్స్‌మన్‌గా కూడా అతడిది కీలక పాత్ర. వెస్టిండీస్ తో వన్డే, శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్ లో గొప్పగా రాణించిన అతడు.. ఈ లీగ్ లోనూ బ్యాట్ కు పనిచెబితే జట్టుకు తిరుగుండదు. ఇక, అయ్యర్‌‌‌‌తో పాటు పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్స్ వెంకటేశ్, కమిన్స్, రసెల్ ఈ టీమ్ స్టార్ పెర్ఫామర్స్ అనడంలో సందేహం లేదు. భారత పిచ్​లపై జోరు చూపించే స్పిన్నర్లు వరుణ్, నరైన్ టీమ్‌కు కొండంత అండ.

కోల్​కతా టీమ్
ఇండియన్స్‌‌‌‌: శ్రేయస్ (కెప్టెన్), చక్రవర్తి, వెంకటేశ్, రాణా, మావి, షెల్డన్, రహానె, రింకూ సింగ్, అనుకూల్, రసిఖ్, ఇంద్రజిత్, అశోక్ శర్మ, ప్రథమ్, అభిజీత్, రమేశ్, అమన్, ఉమేశ్ యాదవ్.

ఫారిన్‌‌‌‌ ప్లేయర్లు: రసెల్, నరైన్, కమిన్స్, చమిక కరుణరత్నె, సామ్ బిల్లింగ్స్, ఫించ్, నబీ.

Story first published: Wednesday, March 23, 2022, 17:20 [IST]
Other articles published on Mar 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X