Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీనా మజాకా.. శతృదేశం కూడా అభిమానించాల్సిందే !!

MS Dhoni fever takes over PSL as Islamabad United supporter dons Pakistan jersey with Mahi name


ఇస్లామాబాద్:
టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులన్నారనే విషయం తెలిసిందే. ఇది చాలాసార్లు.. చాలా సందర్భాల్లో స్పష్టమైంది. కొంతమంది ఫ్యాన్స్ దేశాలతో సంబంధంలేకుండా తమకు నచ్చిన ఆటగాళ్లను ఆరాధిస్తుంటారు.. అభిమానిస్తుంటారు.!
MS Dhoni Fever Takes Over PSL 2020 As A Pak Fan Dons The Former India Skipper’s Jersey | Oneindia

ఆ మధ్య టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పిచ్చిగా అభిమానించే ఓ పాకిస్థాన్ ఫ్యాన్ ఏకంగా తన ఇంటిపై భారత జెండాను ఎగరవేసి చిక్కుల్లో పడ్డట్టు వార్తలు విన్నాం. ఈ తరహా అభిమానులు ధోనీకి ఉన్నారు. ఉప్పు-నిప్పులా భారత్-పాకిస్థాన్ దేశాలు ఉన్నా.. ఇవేవి తమ అభిమానానికి అడ్డం కాదని ఈ ఫ్యాన్స్ నిరూపిస్తున్నారు.

 సరిహద్దులు దాటిన అభిమానం..

సరిహద్దులు దాటిన అభిమానం..

తాజాగా ఓ పాకిస్థాన్ అభిమాని ధోనీ పేరిట ఉన్న తమ క్రికెట్ జట్టు జెర్సీ వేసుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు. అతనేదో ఇంట్లోనో.. ఫ్రెండ్స్ మధ్య వేసుకోలేదు. తమ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్)లో జరిగిన ఓ మ్యాచ్‌కు ధోనీ జెర్సీతో హాజరయ్యాడు. పైగా దానికిపై ధోనీ నెంబర్ 7నే ఉంచాడు. పాకిస్థాన్ జెర్సీపై ధోనీ పేరు వేయించుకొని అటు దేశంపై.. ఇటు ధోనీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. పైగా అతనే ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని యావత్ క్రికెట్ ప్రపంచంతో పంచుకున్నాడు.

కరోనా లేదు.. గిరోనా లేదు.. బరాబర్ షేక్ హ్యాండ్ ఇస్తాం : ఆసీస్ కోచ్

పీఎస్‌ఎల్‌లో ధోనీని మిస్సవుతున్నాం..

పీఎస్‌ఎల్‌లో ధోనీని మిస్సవుతున్నాం..

తన ట్వీట్‌లో పీఎస్ఎల్‌లో ధోనీ ఆడితే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తన షేర్ చేసిన ఈ ఫొటోకు ‘ స్టేడియంలో భాయ్.. ప్రేక్షకులతో కిక్కిరిసిన మైదానంలోఇస్లామాబాద్ యునైటెడ్‌కు ఫుల్ సపోర్ట్.. పీఎస్ఎల్‌లో ధోనీ ఆడకపోవడంతో అతన్ని చాలా మిస్సవుతున్నాం'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

ఇదే తొలిసారి కాదు..

ఇదే తొలిసారి కాదు..

ఇలా ధోనీ పేరిట ఉన్న పాకిస్థాన్ జెర్సీని ధరించుకోవడం ఇదే తొలిసారి కాదు. ఈ అభిమానే షెహజాద్ ఉల్ హసన్ ట్విటర్ యూజర్ ఐడీ @shehzad441 2019 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఇలానే ధోనీ పేరిట ఉన్న పాకిస్థాన్ జెర్సీని ధరించి వార్తల్లో నిలిచాడు. ఇక ఈ ట్వీట్‌కు ఇండియన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దులు దాటిన నీ అభిమానానికి సలాం అంటున్నారు.

ధోనీ రాకకోసం..

వన్డే వరల్డ్‌కప్ నుంచి దాదాపు 8 నెలలు ఆటకు దూరమైన మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. సాధారణంగానే మహీ పునరాగమనం కోసం యావత్ క్రికెట్ ప్రపంచం వెయ్యికళ్లతో ఎదురు చూస్తోంది. ఇప్పటికే చెన్నై చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోనీని ఫ్యాన్స్ అనుక్షణం ఫాలో అవుతూనే ఉన్నారు. ఆఖరికి ప్రాక్టీస్‌లో సిక్స్ కొట్టినా.. ఫైనల్ మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ కొట్టినట్లు ఫీలవుతున్నారు.. తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తొలి సీజన్ ఐపీఎల్ పాకిస్థాన్ క్రికెటర్లు ఆడినా.. అనంతరం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో వారు క్యాష్ రిచ్ లీగ్‌కు దూరమయ్యారు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో తప్పా ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు .

Story first published: Tuesday, March 10, 2020, 13:19 [IST]
Other articles published on Mar 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+