న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లారాకు సూచనలిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్

Kapil Dev imparts golfing lessons to Brian Lara

హైదరాబాద్: క్రికెట్ బంతిని ఆడటం కంటే గోల్ప్ బంతి తనను చాలా ఇబ్బంది పెడుతుందని లారా కొద్ది రోజుల ముందు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయినాగోల్ఫ్‌ బంతిని బాదడమే తనకు ఇష్టమని క్రికెట్ దిగ్గజం లారా చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా తనలోని గోల్ప్ ప్రత్యేకతను చాటి చెప్తూ.. స్వతహాగా తాను ఎడమచేతి వాటం ఆటగాడినని, కానీ రెండు చేతులతో గోల్ఫ్ ఆడతానని తెలిపారు.

కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో గోల్డెన్ ఈగెల్స్ గోల్ఫ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు లారా కొద్ది రోజుల ముందే హైదరాబాద్ వచ్చారు. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ గోల్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా, క్రీడాకారుడిగా బ్రియాన్ లారా హాజరయ్యారు. వినియోగదారుల విశ్వాసం చూరగొనేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయన్నారు.

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు విశేషంగా రాణిస్తోందని.. వచ్చే ప్రపంచ కప్‌లో భారత్‌తో పాటు ఇంగ్లాడ్ జట్లు ఫేవరేట్‌గా బరిలో నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విండీస్ క్రికెట్ సంధి దశలో ఉందని.. త్వరలో పాత రోజులు వస్తాయని ఆకాంక్షించారు. ఐపీఎల్ వల్ల క్రికెట్‌కు మేలు జరుగుతోందని.. ముఖ్యంగా ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు మంచి వేదిక అదేనని అభిప్రాయపడ్డారు.

ఈ పోటీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించటం తనకెంతో సంతోషంగా ఉందని భారత దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ అన్నారు. తనకు క్రికెట్‌తో పాటు గోల్ఫ్ అంటే ఇష్టమని.. ఎప్పటి నుంచో ఈ క్రీడను ఆస్వాదిస్తున్నానని చెప్పారు. అనంతరం లారా, కపిల్ ఇద్దరూ కలిసి గోల్ప్ ఆడారు. గోల్ఫ్‌లో లారాకు కపిల్ చిట్కాలు చెబుతూ కనిపించారు.

Story first published: Sunday, November 11, 2018, 9:40 [IST]
Other articles published on Nov 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X