న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఫార్మూలాతోనే టీమిండియాను ఓడించాం: కేన్ మామ

Kane Williamson says we know on this ground if you build partnerships you can chase anything

అక్లాండ్: మంచి భాగస్వామ్యం నెలకొల్పితే అక్లాండ్ మైదానంలో ఎంతటి లక్ష్యాన్నైనా చేధించవచ్చనే విషయం తమకు తెలుసని, ఇదే ఫార్మూలతో టీమిండియాను ఓడించామని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. టామ్ లాథమ్ అసాధారణ బ్యాటింగ్‌తో రాణించాడని కొనియాడాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది.

ఈ విజయానంతరం మాట్లాడిన కేన్ విలియమ్సన్.. పరిస్థితులకు తగ్గట్లు ఆడి విజయాన్నందుకున్నామని చెప్పాడు. ప్రణాళిక తగ్గట్లు బ్యాటింగ్ చేయడంతో భారీ లక్ష్యాన్ని అందుకోగలిగామని తెలిపాడు.

లాథమ్ లాగేసాడు..

'మ్యాచ్ సగానికి వచ్చే వరకు భారత్ విధించిన లక్ష్యం పోరాడదగినదే అనిపించింది. ఆరంభంలో వికెట్ కాస్త టర్న్ అవ్వడంతో బ్యాటింగ్‌కు ఇబ్బంది అయ్యింది. ముఖ్యంగా క్రాస్ సీమర్స్‌కు అడ్వాంటేజ్ లభించింది. కానీ ఈ మైదానంలో మంచి భాగస్వామ్యం నెలకొల్పితే ఎంతటి లక్ష్యాన్నైనా చేధించవచ్చనే విషయం తెలుసు. టామ్ లాథమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో మేం ఇద్దరం ఏ ఓవర్‌లో కొట్టాలని చర్చించుకున్నాం. స్విచ్ షాట్లతో లాథమ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ వికెట్‌పై స్ట్రైట్‌గా బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ చేయడం కష్టం.

ఆ బిగ్ ఓవర్..

కానీ లాథమ్ స్విచ్ హిట్‌లతో బౌండరీలకు తరలించాడు. ఓవర్‌కు ఒకటి రెండు స్విచ్ హిట్‌లు ఆడాడు. ముఖ్యంగా శార్దూల్ వేసిన 40వ ఓవర్‌లో 5 బౌండరీలతో మ్యాచ్‌ను మా వైపు తిప్పాడు. అదే జోరును మ్యాచ్ అసాంతం కొనసాగించాడు. నేను చూసి అతి గొప్ప వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటి. ఇది మంచి వికెట్. ముఖ్యంగా స్పిన్ కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌లో గెలవడం సంతోషంగా ఉంది. మా పేసర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. నాన్ స్ట్రైకర్‌గా టామీ ఇన్నింగ్స్ చూడటం అద్భుతంగా ఉంది.'అని కేన్ మామ చెప్పుకొచ్చాడు.

అయ్యర్, సుందర్ అదరగొట్టినా..

అయ్యర్, సుందర్ అదరగొట్టినా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80), శిఖర్ ధావన్(77 బంతుల్లో 13 ఫోర్లతో 72), శుభ్‌మన్ గిల్(65 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా... చివర్లో వాషింగ్టన్ సుందర్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ, లూకీ ఫెర్గూసన్ మూడేసి వికెట్లు తీయగా.. ఆడమ్ మిల్నే ఓ వికెట్ పడగొట్టాడు.

చెలరేగిన లాథమ్, కేన్...

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 3 వికెట్లకు 309 పరుగులు చేసింది. టామ్ లాథమ్(104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌ర్లతో 145 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(98 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 94 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్ల వైఫల్యంతో గబ్బర్ సేన భారీ స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది.

Story first published: Friday, November 25, 2022, 16:50 [IST]
Other articles published on Nov 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X