న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నన్ను 'హాఫ్‌ కరోనా' అంటున్నారు.. ఇది జాత్యహంకారమే కదా: గుత్తా జ్వాల

Jwala Gutta revealed how people have started calling her half-corona on Twitter

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా తనను 'హాఫ్‌ కరోనా' అని కొందరు అంటున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల అన్నారు. హాఫ్‌ కరోనా అని అనడం జాత్యహంకార చర్యగా ఆమె అభివర్ణించారు. లాక్‌డౌన్‌ సమయంలో విద్యావంతులే రోడ్లపై జాగింగ్‌ చేయడాన్ని జ్వాల తప్పుబట్టారు. కరోనా పరిస్థిత్తుల నేపథ్యంలో ప్రస్తుతం గుత్తా జ్వాల కుటుంబంతో గడుపుతోంది. తాజాగా జ్వాల ఇండియా టుడేతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు అభిమానులతో పంచుకున్నారు.

<strong>కరోనా కట్టడి కోసం వేలం.. బట్లర్‌ ప్రపంచకప్‌ జెర్సీకి రూ.60 లక్షలు!!</strong>కరోనా కట్టడి కోసం వేలం.. బట్లర్‌ ప్రపంచకప్‌ జెర్సీకి రూ.60 లక్షలు!!

హాఫ్‌ కరోనా అంటున్నారు:

హాఫ్‌ కరోనా అంటున్నారు:

గుత్తా జ్వాల మాట్లాడుతూ... 'నేను సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటా. గతంలో ఈశాన్య రాష్ట్రానికి చెందని ఓ అమ్మాయిపై ఉమ్మి వేశారు. ఆ వీడియో వైరల్‌ అయింది. దీంతో నేను దేశంలో జాత్యహంకారం పెరిగిపోయిందని కామెంట్‌ చేశా. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ప్రారంభమయ్యాక నన్ను కొందరు నెటిజన్లు హాప్‌ కరోనా, చైనాకా మాల్‌, హాఫ్‌ చైనీస్‌, చింకీ అని పిలుస్తున్నారు. ఎందుకుంటే నా తల్లి చైనా దేశస్థురాలు, నా తండ్రి తెలుగువాడు. దీంతో నన్ను హాఫ్‌ కరోనా అని అంటున్నారు. ఇది కూడా జాత్యహంకారమే కదా' అని ప్రశ్నించారు.

విద్యావంతులు జాగింగ్‌ చేయడం చూస్తున్నా:

విద్యావంతులు జాగింగ్‌ చేయడం చూస్తున్నా:

'ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఉదయం లేవగానే మన హైదరాబాద్‌ రోడ్లపై కొందరు విద్యావంతులు జాగింగ్‌ చేయడం చూస్తున్నా. ఆసక్తికర విషయం ఏంటంటే.. వారే కరోనా వైరస్‌ వ్యాప్తిని ఓ వర్గానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు' అని గుత్తా జ్వాల మండిపడ్డారు. 'లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే ఛాన్స్ దక్కింది. ఖాళీ సమయంలో సినిమాలు చూస్తున్నా, ఇంటి పనులు చేస్తూ అమ్మకు సహాయం చేస్తున్నా' అని ఆమె తెలిపారు. ఇంట్లోని పత్రాలు శుభ్రం చేసున్న ఓ వీడియోను కూడా జ్వాల పోస్ట్ చేసింది.

 ఒలింపిక్స్‌ వాయిదా పడటం నిరాశే:

ఒలింపిక్స్‌ వాయిదా పడటం నిరాశే:

'టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడటం క్రీడాకారులకు ఒకింత నిరాశ కలిగించేదే. కానీ.. ఈ సమయంలో అంతకుమించి ఎవరు ఏం చేయలేరు. అయితే ఒలింపిక్స్‌కు సన్నద్దమయ్యే వారు ఈ సమయంలో శారీరకంగా కంటే మానసికంగా ధృఢంగా ఉండాలి. కరోనాపై అందరూ అప్రమత్తంగా ఉండండి. నిత్యం చేతులు శుభ్రం చేసుకోండి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇళ్లలోనే ఉండండి' అని గుత్తా జ్వాల ప్రజలకు సూచించారు.

డేటింగ్‌లో ఉన్నా:

గుత్తా జ్వాల, కన్నడ నటుడు విష్ణు విశాల్‌తో డేటింగ్‌లో ఉన్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమధ్య కాలంలో ఇద్దరు కలిసి తీసుకున్న సన్నిహిత చిత్రాలు కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే వీరి బంధంపై గుత్తా జ్వాల ఇటీవలే స్పష్టత ఇచ్చారు. విష్ణు విశాల్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. 'అవును మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నాం. ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదు. త్వరలోనే మా పెళ్లి జరగబోతోంది. వివాహ తేదీ ఖరారైన తర్వాత, లేదా పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టినప్పుడు మేమే అధికారికంగా ప్రకటిస్తాం' అని చెప్పారు.

Story first published: Wednesday, April 8, 2020, 14:32 [IST]
Other articles published on Apr 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X