న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్‌లోనూ రెండు రోజుల్లో ముగుస్తాయి.. పిచ్‌పై ఫిర్యాదు చేయడానికి ఏంలేదు: ఆర్చర్‌

Jofra Archer says Pitches Dont Matter, Matches Finish Quickly in England too

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లోనూ కొన్ని మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగుస్తాయని, మొతెరా పిచ్‌పై ఫిర్యాదు చేయడానికి ఏం లేదని ఆ జట్టు పేసర్ జోఫ్రా ఆర్చర్ అన్నాడు. ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కాలమ్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన పింక్‌బాల్‌ టెస్ట్ రెండు రోజుల్లోనే పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు ఆ పిచ్‌పై విమర్శలు గుప్పించారు. అది టెస్టు క్రికెట్‌కు సరైన పిచ్‌ కాదని అన్నారు. ఈ క్రమంలోనే ఆర్చర్‌ పిచ్‌కు అనుకూలంగా స్పందించాడు.

పిచ్ గురించి అవసరం లేదు..

పిచ్ గురించి అవసరం లేదు..

'మేం ఎలాంటి పిచ్‌ల మీద ఆడుతున్నామనే విషయం నాకు అవసరం లేదు. ఈ విషయంపై ఫిర్యాదు చేయాల్సిన పని కూడా లేదు. నేను ఇంగ్లండ్‌లో మూడేళ్ల క్రితం గ్లామర్గాన్‌ జట్టుతో డే/నైట్‌ మ్యాచ్‌ ఆడినప్పుడు ఐదు సెషన్లలోనే ఆట ముగిసింది. అలాగే సస్సెక్స్‌ జట్టు తరఫున లీకెస్టర్‌షైర్‌తో తలపడినప్పుడు కూడా రెండు రోజుల్లోనే పూర్తి అయింది. దీన్ని బట్టి అక్కడ కూడా రెండు రోజుల్లో మ్యాచ్‌లు పూర్తవుతాయని తెలుస్తుంది. ఇంకా నిజం చెప్పాలంటే భారత్‌లో ఆడేటప్పుడు స్పిన్‌ పిచ్‌లే ఉంటాయని ముందే ఆశించాలి. బ్యాటింగ్‌ చేయడం అంత తేలిక కాకపోయినా.. పెద్ద సమస్య కాదు' అని ఆర్చర్‌ అందులో వివరించాడు.

నాలుగు వికెట్లే..

నాలుగు వికెట్లే..

కాగా, ఈ సిరీస్‌లో ఆర్చర్‌ ఇప్పటివరకు రెండు టెస్టులే ఆడాడు. తొలి టెస్టులో 3 వికెట్లు తీసిన అతను పింక్‌బాల్‌ టెస్టులో ఒక్క వికెటే పడగొట్టాడు. దీంతో మొత్తంగా 4 వికెట్లే తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు రెండో టెస్టులో ఆర్చర్‌కు బదులు తుది జట్టులోకి తీసుకున్న స్టువర్ట్‌ బ్రాడ్‌ గత రెండు టెస్టుల్లో ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడం గమనార్హం. భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ గురువారం నుంచి ప్రారంభంకానుంది.

బ్యాటింగ్‌పై దృష్టిపెట్టండి..

బ్యాటింగ్‌పై దృష్టిపెట్టండి..

డే/నైట్ టెస్టు పిచ్‌పై ఇంగ్లండ్ కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకోవడం మంచిదికాదని ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. సిల్వర్‌వుడ్‌ అహ్మదాబాద్ పిచ్‌ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఫిర్యాదు చేయాలనుకోవడం ముందే ఓటమిని అంగీకరించినట్లు అవుతుందన్నాడు. అన్ని పక్కనపెట్టి చివరి టెస్టు కోసం బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలని కేవిన్ పీటర్సన్ సూచించాడు.

పిచ్‌ను నిందించడం సరికాదు..

పిచ్‌ను నిందించడం సరికాదు..

కోచ్ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌‌ ఇప్పుడు అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా, ఓటమిని అంగీకరించే స్వభావం ఉండాలని కెవిన్ పీటర్సన్‌ సూచించాడు. 'తమ ఓటమికి పిచ్‌ను నిందించడం, ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకోవడం మానేసి తర్వాతి మ్యాచ్‌కు ఎలా సన్నద్ధమవ్వాలనే విషయాలపై దృష్టి సారించాలి. స్పిన్‌ బౌలింగ్‌కు ఎదుర్కోవడంలో ఇంకెలా మెరుగవ్వాలనే విషయాలపై గురించి ఆలోచించాలి. బ్యాటింగ్‌ విషయంలో మరింత కష్టపడాలి' అని కేపీ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, March 2, 2021, 22:18 [IST]
Other articles published on Mar 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X