న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌తో ఫస్ట్ టెస్ట్‌కు జోరూట్ దూరం.. స్టోక్స్‌కు కెప్టెన్సీ

Joe Root will miss first test against West Indies, Ben Stokes to lead side in his absence


లండన్:
కరోనా కారణంగా మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ఆగిపోయింది. ఇప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ 'బయో సెక్యూర్‌ బబుల్‌' వాతావరణంలో వెస్టిండీస్‌కు సొంతగడ్డపై ఆతిథ్యం ఇచ్చేందుకు ఇంగ్లండ్‌ బోర్డు సిద్ధమైంది. విరామం తర్వాత జరగనున్న తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఇదే కానుంది. ఇప్పటికే ఇంగ్లండ్ చేరి 14 క్వారంటైన్‌ను పూర్తి చేసుకొనిప్రాక్టీస్ మ్యాచ్‌కు విండీస్ సిద్దమైంది.

అయితే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఈ నెల 8న మొదలయ్యే ఫస్ట్ టెస్ట్‌కు రెగుల్యర్ కెప్టెన్ జో రూట్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఇంగ్లండ్ బోర్డు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు కెప్టెన్సీని అప్పగించింది. జోస్ బట్లర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. రూట్ భార్య వచ్చే వారం తమ రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం జట్టుతో కలిసున్న రూట్ నేడు నేడు ట్రైనింగ్ క్యాంప్ వదిలి వెళ్లనున్నాడు. దీంతో ఇంగ్లండ్ టీమ్ తమలో తాము ఆడే వామప్‌తో పాటు ఫస్ట్ టెస్ట్‌కు దూరం కానున్నాడు. సెకండ్ టెస్ట్‌కు తిరిగి జట్టుతో కలుస్తాడు.

వర్ణ వివక్షకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వెస్టిండీస్.. ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టులో తమ జెర్సీ కాలర్‌పై 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' అని ముద్రించిన లోగోతో బరిలోకి దిగనున్నారు.
జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విండీస్‌ జట్టుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. విండీస్‌ ఆటగాళ్లు ధరించబోయే లోగోను అలీషా హోసానా డిజైన్‌ చేయగా... ఇటీవల మళ్లీ ప్రారంభమైన ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో 20 జట్ల ఆటగాళ్లు ఈ లోగోను ధరించారు. సరిగ్గా ఆ లోగోకే ఐసీసీ అనుమతి ఇచ్చింది. జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం గురించి ప్రచారం చేసి, దానికి సంఘీభావం తెలిపే బాధ్యత తమకుందని భావిస్తున్నట్లు వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తెలిపాడు.

Story first published: Wednesday, July 1, 2020, 11:52 [IST]
Other articles published on Jul 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X