న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Jasprit Bumrah : ఓడిపోయినా ఆ మ్యాచ్ నాకెంతో మెమోరెబుల్ అంటూ స్పెషల్ పోస్ట్

Jasprit Bumrah Special post: The result hurting me, But My bowling effort is a memorable

ఐపీఎల్ 2022లో ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 10 మ్యాచ్‌ల వరకు వికెట్ల పరంగా పేలవమైన ప్రదర్శన నమోదు చేశాడు. ముంబై ఇండియన్స్ పేస్ దళాన్ని నడిపించే ఈ పేస్ గుర్రం 10మ్యాచ్‌లలో కేవలం 5వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అత్యంత దారుణ ప్రదర్శన కనబరుస్తున్నందుకు కారణాలు చాలా ఉండగా.. అందులో బుమ్రా వికెట్లు తీయకపోవడం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ఐపీఎల్లో ప్రతిసారి పోటాపోటీగా వికెట్లు తీసే బుమ్రా ఈసారి కేవలం ఎకానమీతో సరిపెట్టుకుంటున్నాడనే ఫీలింగ్ తీసుకొచ్చాడు.

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ ముందు బుమ్రా ఇలాంటి ప్రదర్శన కనబర్చడం టీమిండియాను కూడా ఆందోళనకు గురిచేసింది. అయితే 11వ మ్యాచ్‌లో కోల్ కతాతో తలపడినప్పుడు బుమ్రా తన పేస్ పదును చూపించి తాను ఇంకా టచ్‌లో ఉన్నానని సంకేతాలిచ్చాడు. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా 10పరుగులు ఇచ్చి 5వికెట్లు తీసి ఐపీఎల్లోనే తన అత్యుత్తమ కెరీర్ గణాంకాలు నమోదుచేశాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ పర్ ఫార్మెన్స్ ను మెమోరీగా బుమ్రా స్వీకరించాడు.

కోల్‌కతాపై బుమ్రా ప్రతాపం సాగిందిలా..

కోల్‌కతాపై బుమ్రా ప్రతాపం సాగిందిలా..

ఇక కోల్‌కతా మ్యాచ్‌లో బుమ్రా స్పెషల్ బౌలింగ్‌తో కేకేఆర్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. 15ఓవర్లో ప్రమాదకర రస్సెల్ (9)ను ఔట్ చేసి మ్యాచ్ మూమెంటమ్ చేంజ్ చేసిన బుమ్రా ఆ తర్వాత అదే ఓవర్లో నితీష్ రానాను కూడా ఔట్ చేసి కోల్ కతా స్కోరు బోర్డుకు కళ్లెం వేశాడు. ఇక 18ఓవర్ బంతిని అందుకున్న బుమ్రా ఆ ఓవర్ తొలి బంతికి జాక్సన్ (5)ను పెవిలియన్‌కు పంపించాడు. తర్వాత 3, 4బంతులకు కమ్మిన్ (0), సునీల్ నరైన్ (0)లను ఔట్ చేసి కోల్‌కతాకు భారీ స్కోరు చేయకుండా అడ్డుపడ్డాడు. ఇక ఆ ఓవర్లో మొత్తం 3వికెట్లు తీసిన బుమ్రా మెయిడిన్ వేశాడు. ఇక ఆఖరి ఓవర్లోనూ బుమ్రా ఒకే ఒక్క రన్ ఇచ్చాడు.

తనపై నెలకొన్న డౌట్స్ పటాపంచలు

తనపై నెలకొన్న డౌట్స్ పటాపంచలు

ఐపీఎల్‌లో తన తొలి ఐదు వికెట్ల హాల్ సాధించిన బుమ్రా.. తన ఫామ్ విషయమై వస్తున్న విమర్శలను, సందేహాలను పటాపంచలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 52పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైనప్పటికీ.. బుమ్రా బౌలింగ్ మాత్రం క్రికెట్ ప్రముఖులను ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్, ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న బుమ్రా టచ్‌లోకి రావడంపై టీమిండియా వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే టీ20 వరల్డ్ కప్ ముంగిట బుమ్రా ఫామ్ పుంజుకోవడం టీమిండియాకు చాలా అవసరం.

 ఫలితం బాధించింది.. ప్రదర్శన మెమోరినిచ్చింది

ఫలితం బాధించింది.. ప్రదర్శన మెమోరినిచ్చింది

ఈ మ్యాచ్ ఫలితంపై నిరాశ వ్యక్తం చేసిన బుమ్రా తనకు మాత్రం మెమోరబుల్ అని పేర్కొంటూ ట్విట్టరులో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్టులో మ్యాచ్‌లో ఉపయోగించిన బంతిపై 4-1-10-5 అని తన ప్రదర్శన గణాంకాలు రాసిన ఫోటోను పంచుకున్నాడు. 'నిన్న రాత్రి రిజల్ట్ వల్ల నిరుత్సాహపడ్డాను. అయినప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్' అని బుమ్రా పోస్టులో పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్లో బుమ్రా 11మ్యాచ్‌ల్లో 10వికెట్లు పడగొట్టాడు. అతను ఈ సీజన్‌లో 7.41ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ప్రత్యర్థి జట్లు బుమ్రా బౌలింగ్లో డిఫెన్స్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాయి. దీంతో ఎకానమీ బానే ఉన్నప్పటికీ వికెట్లు మాత్రం బుమ్రాకు అంతగా దక్కలేదు.

Story first published: Tuesday, May 10, 2022, 20:30 [IST]
Other articles published on May 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X