న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మేం ఒకరినొకరం నిందించుకోం.. అది మా కల్చరే కాదు : బుమ్రా

Jasprit Bumrah Says We do not play blame game

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో గెలిచే అవకాశాలను భారత్ చేజేతులా చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మన్ చేతులెత్తేసినా.. బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని కట్టడి చేసి 7 పరుగుల ఆధిక్యాన్ని అందించారు. కానీ వారందించిన సహకారాన్ని అందిపుచ్చుకోలేకపోయిన బ్యాట్స్‌మెన్ మరోసారి పేలవ బ్యాటింగ్‌తో దారుణంగా విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో 90 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు.

అయితే మ్యాచ్ అనంతరం బౌలర్లు అద్భుతంగా రాణించిన వేళ బ్యాట్స్‌మన్ వైఫల్యంతో అవకాశాలను దెబ్బతీశారా? అని టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ప్రశ్నించగా.. తాము ఒకరినొకరం నిందించుకోమని, అసలు ఆలాంటి ఆటనే ఆడమని సమాధానమిచ్చాడు.

మైదానంలో కోహ్లీ బూతుపురాణం.. ప్రేక్షకుల వైపు అసభ్య సైగలు!! (వీడియో)మైదానంలో కోహ్లీ బూతుపురాణం.. ప్రేక్షకుల వైపు అసభ్య సైగలు!! (వీడియో)

అది మా కల్చరే కాదు..

అది మా కల్చరే కాదు..

‘మేం ఒకరినొకరం నిందించుకునే గేమ్ ఆడం. అసలు మా టీమ్ సంప్రదాయమే అది కాదు. జట్టులో ఎవరిని నిందించాలని కూడా చూడం. కొన్నిసార్లు బౌలర్లు ఒక్క వికెట్ తీయకుండా విఫలమవచ్చు. అప్పుడు బ్యాట్స్‌మన్ మమ్మల్నేం అనరే. అసలు ఈ తరహా చర్చే మా జట్టులో ఉండదు'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

ఇంకా పంత్, విహారీ ఉన్నారు..

ఇంకా పంత్, విహారీ ఉన్నారు..

ఇక ఇద్దరు బ్యాట్స్‌మన్ మిగిలి ఉన్నారని, వారు అద్భుతంగా రాణించి ప్రత్యర్ధికి గట్టి సవాల్ విసురుతారని క్రీజులో ఉన్న పంత్, విహారీలపై బుమ్రా ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఒక జట్టుగా పరిస్థితులకు తగ్గట్టు విజయం కోసం ప్రయత్నిస్తాం. ఇంకా ఇద్దరు బ్యాట్స్‌మన్ ఉన్నారు. సాధ్యమైనన్నీ ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాం. అందరం కలికట్టుగా విజయం కోసం పోరాడుతాం. మేం అనుకున్నాదానికంటే ఎక్కువే వికెట్లు కోల్పోయాం. కానీ మేం ఎవరినీ నిందించం. ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయం కోసం పోరాడుతాం.'అని బుమ్రా తెలిపాడు.

వ్యక్తిగత ప్రదర్శనను పట్టించుకోను..

వ్యక్తిగత ప్రదర్శనను పట్టించుకోను..

నేనెప్పుడు వ్యక్తిగత ప్రదర్శనల గురించి ఆలోచించను. చూడను. కానీ మీరే లెక్కలు వెస్తారు. బాగా బౌలింగ్ చేయాలని చూస్తారు. అద్బుతంగా రాణిస్తే మెచ్చుకుంటారు. లేకుంటే తిడుతూ.. నాపై ఒత్తిడిని సృష్టిస్తారు. కానీ నా దృష్టి ఎప్పుడూ జట్టు గెలుపుకోసం నేనేం ఏం చేయాలనేదానిపైనే ఉంటుంది.'అని బుమ్రా చెప్పుకొచ్చాడు. ఇక సహచర్ పేసర్ షమీతో కలిసి రాణించడం సంతోషంగా ఉందని ఈ యార్కర్ల స్పెషలిస్ట్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా మూడు వికెట్లు తీయగా.. షమీ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Sunday, March 1, 2020, 17:29 [IST]
Other articles published on Mar 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X