న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి భారత బౌలర్‌గా ఐపీఎల్లో రికార్డ్ సాధించిన బుమ్రా.. మలింగ్ తర్వాత రెండో ప్లేయర్‌గా

Jasprit Bumrah holds the record for taking 15 wickets in 7consecutive IPL seasons

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఐదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ గెలిచి ఐపీఎల్ 2022లో తమ చిట్టచివరి మ్యాచ్‌ను గెలుపుతో ముగించింది. తద్వారా సీజన్‌లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసిన ముంబై ఎనిమిది పాయింట్లు సాధించింది. చెన్నై సైతం 8పాయింట్లతో ఉన్నప్పటికీ.. ముంబై కన్నా కాస్త మెరుగైన రన్ రేట్ ఉండడం వల్ల చెన్నై 9వ స్థానంలో ఉండగా.. ముంబై అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ వరుసగా రెండోసారి ఐపీఎల్లో ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించలేకపోయింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈసారి సీజన్లో పేలవ ప్రదర్శన కొనసాగించింది. తొలి 8 మ్యాచ్‌లలో ఒక్క విజయం కూడా సాధించలేదు. ముంబైకి ఈ సీజన్ చేదు సీజన్ అయినా.. ఆ జట్టులో వ్యక్తిగత ప్రదర్శనల్లో కొందరు అద్భుత ప్రతిభ కనబరిచారు. అందులో తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, జస్ప్రీత్ బుమ్రా తదితరులు ఉన్నారు. ఇకపోతే పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్లో తొలుత అంత ప్రభావం చూపకపోయినప్పటికీ సెకండాఫ్‌లో మాత్రం జోరందుకున్నాడు. ఈ సీజన్లో బుమ్రా తన ప్రదర్శన ద్వారా ఐపీఎల్లో ఓ అరుదైన రికార్డ్ అందుకున్నాడు.

సెకండాఫ్‌లో పుంజుకున్న బుమ్రా

సెకండాఫ్‌లో పుంజుకున్న బుమ్రా

జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లలో అసలు వికెట్లే తీయలేదు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల హాల్ సాధించి తన మునుపటి ఫాం అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడమే కాకుండా 5/10 ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. అప్పటి నుంచి టోర్నమెంట్ చివరి మ్యాచ్ వరకు తన కన్సిస్టెన్సీ బౌలింగ్ ప్రదర్శనను కనబరిచాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 3/25ప్రదర్శనతో ఢిల్లీని దెబ్బతీశాడు. అతను పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రోవ్‌మాన్ పావెల్‌ల లాంటి హిట్టర్లను ఔట్ చేసి ఢిల్లీ స్కోరు బోర్డును పరిమితం చేశాడు. ముఖ్యమైన వికెట్లు తీయండంతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ చేయాల్సిన దాని కంటే తక్కువ స్కోరే చేయగలిగింది.

మలింగ తర్వాత రెండో బౌలర్‌గా

మలింగ తర్వాత రెండో బౌలర్‌గా

నిన్నటి మ్యాచ్‌లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన వల్ల అతను వరుసగా ఏడు ఐపీఎల్ సీజన్లలో 15 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన శ్రీలంక మాజీ పేస్ దిగ్గజం లసిత్ మలింగ ఈ ఫీట్ సాధించగా.. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన రెండో బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. బుమ్రా ఢిల్లీ క్యాపిటల్స్‌పై నిన్నటి మ్యాచ్‌‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన వల్ల ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

మంచి ఎకానమీతో బౌలింగ్

మంచి ఎకానమీతో బౌలింగ్

ఇకపోతే ఐపీఎల్ 2022లో బుమ్రా ఆడిన 14మ్యాచ్‌లలో 25.53 సగటుతో, 7.18ఎకానమీ రేటుతో 15వికెట్లు తీశాడు. అతను తీసిన వికెట్లలో ఎక్కువ కీలక బ్యాటర్లవే ఉండడం గమనార్హం. ఇకపోతే నిన్నటి మ్యాచ్‌లో తొలుత ఢిల్లీ బ్యాటింగ్ చేయగా.. ఆ జట్టు విధించిన 160పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో ముంబై బ్యాటర్లు దూకుడు ప్రదర్శించారు. తొలుత ఇషాన్ కిషన్ (48పరుగులు 35బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) చెలరేగగా.. డెవాల్డ్ బ్రెవిస్ (37పరుగులు 33బంతుల్లో 1ఫోర్ 3సిక్సర్లు), తిలక్ వర్మ (21పరుగులు 17బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్), టిమ్ డేవిడ్ (34పరుగులు 11బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) వీరవిహారం చేసి ముంబైకి 5వికెట్ల తేడాతో మరుపురాని విజయాన్ని అందించారు. తద్వారా ఢిల్లీ ప్లేఆఫ్ చేరలేదు. ఆర్సీబీ ప్లేఆఫ్ చేరింది.

Story first published: Sunday, May 22, 2022, 17:28 [IST]
Other articles published on May 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X