న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు ర్యాంకింగ్స్‌: కోహ్లీని వెనక్కినెట్టిన స్మిత్‌.. టాప్-5లో బుమ్రా

ICC Test Rankings 2019 : Kohli Displaced By Steve Smith As No 1 Batsman, Jasprit Bumrah Up To No 3
Jasprit Bumrah breaks into top 5 of bowlers; Steve Smith displaces Virat Kohli as No.1 batsman


హైదరాబాద్:
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టాప్‌ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. స్మిత్ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని వెనక్కినెట్టి టాప్‌కు చేరాడు. ప్రస్తుతం 904 రేటింగ్‌ పాయింట్లతో స్మిత్‌ అగ్రస్థానంలో ఉండగా.. 903 రేటింగ్‌ పాయింట్లతో కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడంతో టాప్‌ను చేజార్చుకున్నాడు.

ఏడాదిగా పోరాటం చేస్తూ విజయం సాధించా.. న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు: షమీ భార్యఏడాదిగా పోరాటం చేస్తూ విజయం సాధించా.. న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు: షమీ భార్య

 వరుస సెంచరీలు:

వరుస సెంచరీలు:

యాషెస్‌ సిరీస్‌లో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్న నేపథ్యంలో మరిన్ని రేటింగ్‌ పాయింట్లు తన ఖాతాలో వేసుకుని టాప్‌ను కాపాడునే అవకాశం ఉంది. 2018 ఆగస్టులో టాప్‌ ర్యాంకులో నిలిచిన స్మిత్‌.. బాల్ టాంపరింగ్ నిషేధం కారణంగా టాప్‌ను కోల్పోయాడు. నిషేధం అనంతరం పునరాగమనం చేసిన స్మిత్‌ యాషెస్‌లో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టులో రెండు వరుస సెంచరీలు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు. గాయం కారణంగా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌, మూడో టెస్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకోవడంతో నాలుగో టెస్టులో ఆడే అవకాశం ఉంది.

టాప్-10లో రహానే:

టాప్-10లో రహానే:

మొదటి రెండు స్థానాల్లో స్మిత్, కోహ్లీ ఉండగా.. కివీస్ కెప్టెన్ విల్లియంసన్ (878) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా (825) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక భారత్ నుంచి టాప్-10లో అంజిక్య రహానే (725) ఉన్నాడు. రహానే నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 7వ స్థానంకు చేరుకున్నాడు. కేవలం ఆరు టెస్టులు ఆడిన హనుమ విహారి 40 స్థానాలు ఎగబాకి 30వ స్థానానికి చేరుకున్నాడు.

'చెత్త మాటలు మాట్లాడొద్దు.. బుమ్రా నిబంధనల ప్రకారమే బౌలింగ్‌ చేస్తున్నాడు'

బుమ్రా@3

బుమ్రా@3

బౌలర్ల ర్యాంకింగ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా మూడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న బుమ్రా ఏడో స్థానం నుంచి మూడో స్థానానికి దూసుకొచ్చాడు. జాసన్ హోల్డర్ ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని 4వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమ్మిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. కాగిసో రబాడ రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌ల జాబితాలో హోల్డర్ టాప్‌లో ఉన్నాడు.

Story first published: Tuesday, September 3, 2019, 16:56 [IST]
Other articles published on Sep 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X